కన్నడ బ్యూటీ రష్మిక క్రేజీ హీరోయిన్ గా మారిపోవడంతో ప్రస్తుతం చాలామంది యంగ్ హీరోలు ఆమెతో నటించడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఒకవైపు ఆమె సినిమాలలో నటిస్తూనే మరొక వైపు వరసపెట్టి అనేక వ్యాపార సంస్థల ఓపెనింగ్ ఫంక్షన్స్ కు అతిధిగా వెళుతూ చేస్తున్న సందడి పై కొందరు సెటైర్లు వేస్తున్నారు. 
Rashmika Mandanna
ప్రస్తుతం చాల వ్యాపార సంస్థలు ముఖ్యంగా బట్టల షాపులు నగల షోరూమ్స్ తమ కొత్త షాపుల ఓపెనింగ్ ఫంక్షన్స్ కు రష్మికను అతిధిగా వరస పెట్టి పిలుస్తున్న నేపధ్యంలో చవక కత్తెరలు ఎక్కువ రిబ్బన్స్ కు చిరునామాగా రష్మిక మారింది అంటూ ఆమె పై వ్యాపార వర్గాలలో జోక్స్ పడుతున్నట్లు సమాచారం.  వాస్తవానికి రష్మిక లాంటి స్థాయి ఉన్న హీరోయిన్ ఒక షాప్ ఓపెనింగ్ కు రావాలి అంటే 10 లక్షలు పారితోషికంగా తీసుకుంటారు. 
Cute
అయితే రష్మిక ఎవ్వరూ ఊహించని విధంగా తనను పిలిచిన వ్యాపార సంస్థల అధినేతలకు అడగగానే ఊహించని డిష్కౌంట్లు ఇస్తూ ఆమెకు 5 లక్షలు పారితోషికంగా ఇచ్చినా సద్దుకుపోతు చాలామందికి సహకరిస్తున్నట్లు టాక్. దీనితో ప్రస్తుతం నడుస్తున్నది పండుగల సీజన్ కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న రష్మిక ప్రతిరోజు ఎదో ఒక షాప్ ఓపెనింగ్ ఫంక్షన్ లో సందడి చేస్తూ తన కొత్త ఆదాయ పదకాన్ని కనిపెట్టినట్లు టాక్.
Rashmika Mandanna New Latest HD Photos | Chalo, Geetha Govindam Movie Heroine Actress Rashmika Mandanna Photo Shoot Images
దీనితో ఈ యంగ్ హీరోయిన్ స్ట్రాటజీ చూసి చాలామంది టాప్ హీరోయిన్స్ కూడ ఖంగారు పడుతున్నట్లు టాక్. ఇప్పుడు ఈవార్తలు ఇలా వైరల్ కావడంతో పండుగ సీజన్ లో బడా వ్యాపార సంస్థలు డిస్కౌంట్లు ఇచ్చినట్లుగా రష్మిక కూడా డిస్కౌంట్లు ఇస్తోంది అంటూ మరి కొందరు జోక్స్ వేసుకుంటున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: