ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున్న ఉద్యమం కొనసాగుతుంది.  ఇక  హాలీవుడ్ ను కుదిపేసిన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తుంది.  ఇండస్ట్రీలో తమను లైంగికంగా వేధించిన వారి గురించి చిన్నా, పెద్ద నటీమణులు ఇప్పుడు గొంతు విప్పడం సంచలనం సృష్టిస్తుంది.   తాజాగా బాలీవుడ్ హీరోయిన్, ఫిల్మ్ ఫేర్ అవార్డు విజేత కంగనా రనౌత్ బాంబు పేల్చింది.  కంగనా రౌన్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు నటించినా..క్విన్ ఆమెకు మంచి పేరు తెచ్చింది.  అందుకే ఆమెను క్విన్ కంగనా రౌనత్ అని పిలుస్తారు.  అలాంటి సినిమా దర్శకుడిపై ఆమె ఆరోపణలు చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. 
Kangana Ranaut,Vikas Bahl,Queen
క్వీన్’ సినిమా సమయంలో దర్శకుడు వికాస్ బెహెల్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. వికాస్ తనను వేధిస్తున్నాడని ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థకు చెందిన యువతి ఆరోపించిన నేపథ్యంలో కంగన ఆమెకు మద్దతుగా ముందుకొచ్చింది.  కాగా, ఫాంటమ్ ఫిల్మ్స్ ను దర్శకులు అనురాగ్ కశ్యప్, వికాస్, నిర్మాత మధు మంతెన కలిసి స్థాపించారు.   ఇప్పుడు ఇందులో ఒక సభ్యుడైన వికాస్ వేధించినట్లు సదరు యువతి చెబుతున్నది వందకు వంద శాతం నిజమేనని వెల్లడించింది. 
Image result for kangana ranaut
‘క్విన్’ సినిమా షూటింగ్ నడుస్తున్న సమయంలో వికాన్ నన్ను విష్ చేస్తున్నట్లు తన కౌగిట్లో నలిపేసేవాడు.  కాకపోతే అది ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసేవాడు..కానీ ఆ బాధ నాకు మాత్రం అర్థం అయ్యేది.   వికాస్ కు పెళ్లయినా పరాయి స్త్రీలతో సంబంధం ఉంది. ఇతరుల వ్యక్తిగత అలవాట్ల గురించి నేను తప్పుపట్టను.  కానీ అలాంటి నీచమైన పనులు అందరితో చేస్తే ఎవరైనా తప్పుపడతారు అంటుంది.  నేను షూటింగ్ చేసి అలసిపోయి ఎక్కువగా నిద్రపోయేదాన్ని..ఆ సమయంలో నేను ఎక్కువగా నిద్రపోతానని ఎగతాళి చేసేవాడు’ అని కంగన చెప్పుకొచ్చింది. 
Image result for kangana ranaut
 క్విన్ సినిమా తర్వాత మరో సినిమా కోసం వికాస్ నా వద్దకు వచ్చాడు..కానీ ఆ కథ నచ్చలేదు..కొన్ని మార్పులు చేయమనడంతో తన అహం దెబ్బతిని అప్పటి నుంచి తనతో మాట్లాడటం మానేశాడు.  మరోవైపు తనుశ్రీ దత్తా కూడా తనపై లైంగికంగా నటుడు, దర్శకుడ, కొరియోగ్రాఫర్ ఇబ్బంది పెట్టారని బాలీవుడ్ లో సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: