తెలుగు ఇండస్ట్రీలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద అంటే అందరికి పరిచయమే.  ఈ అమ్మడు కెరీర్ లో ఎన్నో వివాదాలు ఎదుర్కొంది.  అంతే కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ నెంబర్ వన్. ఇప్పుడు ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం ఓ రేంజ్ లో కొనసాగుతుంది.  హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం భారతీయ ఇండస్ట్రీలో కూడా ప్రకంపణాలు సృష్టిస్తున్నాయి.  బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై నానా పాటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపించిన అనంతరం మరోసారి దేశవ్యాప్తంగా ‘మీటూ’ కాంపెయిన్ ఉధృతం అయింది. 
అన్నీ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం
 తాజాగా సింగర్ చిన్మయి స్పందిస్తూ..తాను తొమ్మిదేళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చిన్మయి తెలిపారు.   మా అమ్మ తన డాక్యుమెంటరీకి సంబంధించి రికార్డింగ్ సెషన్ సూపర్ వైజ్ చేస్తూ బిజీగా ఉంటే నేను పక్కన రూములో పడుకుని ఉన్నాను. ఓ వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేసి రాక్షసానందం పొందాడు.  వెంటనే నేను ఉలిక్కిపడి లేచాను..తర్వాత మా అమ్మకు ఆ అంకుల్ గురించి చెప్పాను.   
 ఈవ్ టీజింగ్ వల్లే పడిపోయాను
మహిళలు ప్రతి రోజూ, ప్రతి చోటా ఏదో ఒకరకంగా లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ప్రతి రోజూ జరిగిన సంఘటనలు గుర్తుంచుకోవడం చాలా కష్టం. చెడు ఉద్దేశ్యం లేని హగ్ ఒకే... కానీ వారిలో ఎలాంటి ఉద్దేశ్యం ఉందో మనం పసిగట్టడం చాలా కష్టం... అని చిన్మయి వ్యాఖ్యానించారు. నేను టీనేజ్ లో ఉన్న సమయంలో కొంత మంది తన జేబులో చేయి పెట్టి ఏముందని ఆటపట్టించే వారు..అప్పడు అర్థం అయ్యేది కాదు..కానీ అది ఎంతో తప్పుడు ఉద్దేశం అని తర్వాత తెలిసి బాధపడ్డాను.

19 ఏళ్ల వయసులో మరోసారి వేధింపులకు గురయ్యాను. ఒక ఓల్డ్ మ్యాన్ ఒక కారణంతో తన ఆఫీసుకు పిలిచాడు. ఆ మనిషి చాలా మంచి వాడని భావించాం..తనతో ఒంటరిగా మాట్లాడాలని పిలిపించుకొని తనను కౌగిలించుకొని అసహ్యంగా ప్రవర్తించాడు..అప్పుడు అర్థం అయ్యింది..అతగాడి క్యారెక్టర్.  ఇలా జీవితంలో ఎన్నో వొడిదుడుకులు లైంగిక వేధింపులు భరించాల్సి వచ్చింది..సామాన్యులైనా..సెలబ్రెటీలు అయినా..అడవారికి ఈ అవమానాలు తప్పడం లేదని వాపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: