క్యాన్సర్ అంటే ఎవరికైనా గుండెల్లో ధడ..చనిపోతామని బాద..కానీ కొంత మంది మాత్రం ప్రాణాంతకరమైన క్యాన్సర్ ని ధృఢ సంకల్పం..ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ఆరోగ్యంగా బతికి బయట పడ్డారు.  హాలీవుడ్, బాలీవుడ్ లో పలువురు ఈ క్యాన్సర్ బారిన పడి బతికిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  తాజాగా న్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్న బాలీవుడ్ నటి సోనాలిబింద్రే ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. సోనాలి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ తెలిపాడు. ట్రీట్‌మెంట్ సమయంలో భరించలేని నొప్పితో బాధపడిందని చెప్పుకొచ్చాడు.   


ఆమె ఎదుర్కొంటున్న చికిత్సా విధానం.. తను నొప్పిని భరిస్తున్న తీరును ట్విట్టర్ ద్వారా అభిమానులతో సోనాలి షేర్ చేసుకున్నారు.‘గత కొన్ని నెలలుగా నాకు మంచి, చెడు రెండూ ఎదురయ్యాయి. నేను చాలా బలహీనపడిపోయాను. కనీసం చేతి వేలు పైకి ఎత్తడానికి కూడా శక్తిలేక బాధపడ్డాను. శారీరకంగా ప్రారంభమైన ఈ నొప్పి.. మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బతీస్తోంది. కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు చాలా కష్టమైంది.. కనీసం నవ్వినా నొప్పి వచ్చేది. కొన్నిసార్లు కేన్సర్‌ నా నుంచి మొత్తం తీసేసుకుంటున్న భావన కలుగుతోంది.


ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నా.  ప్రతి నిమిషం తాను పోరాటం చేస్తున్నానని, ఇలాంటి పరిస్థితి జీవితంలో కచ్చితంగా వస్తుందని రాసుకొచ్చింది.   నొప్పిని భరిస్తూ ఏడ్చానని, దాన్ని అంగీకరించడమే మంచిదని, భావోద్వేగానికి గురికావడం తప్పేమీకాదని రాసుకొచ్చింది. ఇప్పుడు ట్రీట్‌మెంట్ కొనసాగుతోందని, తన రూపం మారిందని, త్వరలో ఇంటికి వచ్చేస్తానంటూ రాసుకొచ్చింది. నెగిటివ్‌ ఎమోషన్స్‌ను ఫీల్‌ అవడం కూడా తప్పు కాదు. కానీ, ఆ తర్వాత దాన్ని గుర్తించాలి.


మీ జీవితంలో దాని ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఈ జోన్‌ నుంచి బయటికి రావడానికి చాలా స్వీయ జాగ్రత్త అవసరం. ఇలాంటి ఆలోచనలు రాకుండా చేయడంలో నిద్ర చాలా సహాయపడుతుంది.  సోనాలి తను బాధపడుతున్న విధానాన్ని తెలియజేస్తూనే అలాంటి చెడు రోజులు జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురవుతాయని.. ఎదుర్కొని సంతోషంగా ఉండాలని సలహా ఇచ్చారు. 






మరింత సమాచారం తెలుసుకోండి: