తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే బయోపిక్ ‘ఎన్టీఆర్’. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి.  అయితే ఈ సినిమా ఎన్టీఆర్ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే.   ఎన్టీఆర్ సినీ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ కథానాయుడు’సాగితే..రెండో భాగం ఆయన రాజకీయ నేపథ్యంలో రాబోతున్నట్లు దర్శకులు తెలిపారు..దీనికి ‘ఎన్టీఆర్ అధినాయకుడు’అని పేరు పెట్టారు.   అయితే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే..ఇందులో పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉండటంతో భారీ తారాగణాన్నే చిత్రబృందం ఎంచుకుంది.

ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ పోషిస్తుండగా.. ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్,  సీఎం చంద్రబాబు పాత్రను రానా పోషిస్తున్నారు.  అయితే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు ఈ మద్య రిలీజ్ చేశారు.  అంతే కాదు సుమంత్, రానా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.  అయితే సీఎం చంద్రబాబు పాత్రలో రానా లుక్ నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది.  ఆజానుభాహుడిగా ఉండే రానా సన్నగా తయారయ్యాడు.  ఎన్టీఆర్ గా బాలకృష్ణ, చంద్రబాబు గా రానా ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. 

తాజాగా ‘నంబర్ వన్ యారీ’ సీజన్ 2 ప్రమోషన్స్‌లో ఉన్న రానా తన పాత్ర ఎంపికపై ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర సమాధానమిచ్చాడు. సీఎం చంద్రబాబు పాత్రలో నటించడం అంత సామాన్య విషయం కాదు..ఆయన ఆహార్యం..నడక..మాట్లాడే విధానం అన్నీ జాగ్రత్తగా నేర్చుకున్నతర్వాత నేను ఫిట్ అవుతానని నిర్ణయించుకున్నారు.  అది ఛాలెంజింగ్ పాత్ర. అయితే క్రిష్ లాంటి స్నేహితుడి అండతో.. ఆ కష్టాన్ని అధిగమిస్తున్నాను  అని తెలిపారు. స్నేహితుల వల్లే నటన, నిర్మాణ రంగాల్లో రాణించగలుగుతున్నానని ఈ సందర్భంగా రానా వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: