నవరాత్రి దీక్షలోని ఐదవ రోజు అమ్మవారి అవతారంలో విశేష మహత్యం ఉన్నట్లు శాస్త్రాలు చెపుతున్నాయి. ఈరోజు అమ్మవారి పూజ చేసే సాధకుడి మనసు విశుద్ధ చక్రంలో లయమై ఉంటుంది. ఈ చక్రంలో స్థిరమనస్కుడైన సాధకుడు బాహ్యక్రియలు అన్నీ మరిచిపోయి ఈ అవతారంలో ఉన్న అమ్మ దుర్గాదేవిని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం.

ఈరోజు అమ్మవారిని స్కంద మాతగా పూజించిన వారికి ఈ ఉపాసన వల్ల కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఈనాటి అమ్మవారి పూజ వల్ల సాధకుడుకి మనశ్శాంతితో పాటు మరణం తరువాత మోక్ష ద్వారాలు సులభంగా తెరుచుకుంటాయని ఋషులు చెపుతున్నారు. 

అయితే ఈరోజు చేసే స్కంద మాత ఉపాసనలో ఎటువంటి పొరపాట్లు రాకుండా అమ్మవారికి కోపం కలగకుండా ప్రవర్తించాలి. తేజో విరాజిత అయి ప్రకాసించే అమ్మవారిని దర్సిమ్చుకునే భక్తులకు అమ్మవారిలో ఈరోజు ఒక అద్భుతమైన తేజస్సు కనిపిస్తుంది. 

ఈరోజు అమ్మ వారికి సంపెగలు జాజిపూలతో పూజచేయాలి. ఈరోజు అమ్మ వారికి అల్లంగారెలు బెల్లం పొంగలి నివేదన పెట్టాలి. భక్తితో పూజించి అమ్మ అనుగ్రహం పొందుతాం..



మరింత సమాచారం తెలుసుకోండి: