కాస్టింగ్ మాటలు కొన్ని ఎమోషనల్ సీన్స్కాస్టింగ్ మాటలు కొన్ని ఎమోషనల్ సీన్స్మ్యూజిక్ రొటీన్ స్క్రీన్ ప్లే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ

కాకినాడలో బిటెక్ పూర్తి చేసిన సంజు (రామ్) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. మొదటి చూపులోనే అను (అనుపమ పరమేశ్వరన్)ను చూసిన సంజు ఆమెను ఇష్టపడతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. సంజు మదర్ సితార అతన్ని హైదరాబాద్ లో తన స్నేహితుడు విశ్వనాథ్ (ప్రకాశ్ రాజ్) ఇంటి పంపిస్తుంది. అక్కడ తన ప్రేమ గురించి విశ్వనాథ్ తో చెబుతాడు సంజు.

ప్రేమని గెలిపించుకోవడం కోసం తన సలహాలు తీసుకుంటాడు. ఆఫీస్ లో పరిచయమైన రీతు (ప్రణీత)సంజుని ప్రేమిస్తుంది. ఇంతకీ సంజు ప్రేమిస్తుంది ఎవరిని..? సంజు ప్రేమకు విశ్వనాథ్ ఎలా అడ్డుగా మారాడు..? సంజు, అనుల ప్రేమ ఎలా ఫలించింది అన్నది సినిమా కథ.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాలో రామ్ ఎమోషనల్ సీన్స్ లో కూడా అలరించాడు. అనుపమ పరమేశ్వరన్ కూడా బాగానే చేసింది. ప్రణీత పాత్ర చిన్నదే అయినా పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాలో హీరోతో పాటుగా ప్రకాశ్ రాజ్ పాత్ర ఉంది. తన మార్క్ చూపిస్తూ నటనతో ఆకట్టుకున్నారు ప్రకాశ్ రాజ్. సితార, సురేష్ ల నటన ఆకట్టుకుంది. మిగతా వారంతా అలరించారు.

విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో రామ్, అనుపమల జోడి బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ పర్వాలేదు. బిజిఎం అలరించింది. కథ, కథనాల్లో దర్శకుడు కొత్తగా చెప్పింది ఏమి లేదు కాని కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా అంతా హాయిగా సాగుతుంది. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అన్నట్టు ఉన్నాయి.

హీరో జాబ్ కోసం హైదరాబాద్ వెళ్లడం.. అక్కడ తన తల్లి స్నేహితుడు ఇంట్లో గెస్ట్ గా ఉండటం.. అతని కూతురినే ప్రేమించడం.. తన ప్రేమ వల్ల వారి స్నేహం చెడిపోకూడదని ప్రేమను త్యాగం చేయాలనుకోవడం. ఇదేదో కాస్త అటు ఇటుగా విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చవ్ సినిమాలా ఉంది కదా.


దాదాపు హలో గురు ప్రేమ కోసమే కథ దానికి దగ్గరా ఉంటుంది. తండ్రి అంటే ఇష్టం ఉన్న అమ్మాయి తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుంది. హీరో మీద ఇష్టం ఉన్నా సరే దాన్ని కాదంటుంది. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. అయితే హలో గురు ప్రేమ కోసమే ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపించాడు దర్శకుడు నక్కిన త్రినాథ రావు.


అతను చేసిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాల పంథాలోనే ఈ సినిమా కూడా ఎంటర్టైనింగ్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇక హీరో హీరోయిన్ సీన్స్ కన్నా రామ్, ప్రకాశ్ రాజ్ పాత్రల మధ్య సీన్స్ ఆసక్తిగా ఉంటాయి. మొత్తానికి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా హలో గురు ప్రేమకోసమే వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు.


Ram,Anupama Parameswaran,Pranitha,Prakash Raj,Trinadha Rao Nakkina,Dil Raju,Devi Sri Prasadరామ్ హలో గురు ప్రేమ కోసమే.. జస్ట్ ఫర్ ఎంటర్టైనింగ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: