ప్రభాస్ పుట్టినరోజునాడు అతడి పెళ్లి విషయంమై ఒకప్రకటన వస్తుంది అనిఆశించిన అభిమానులకు ‘సాహో’ మేకింగ్ ట్రైలర్ తో సరిపెట్టినవిషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ‘సాహో’ షూటింగ్‌లో బిజీగా ఉన్నా ప్రభాస్  త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతాడని ప్రభాస్ సన్నిహితులు లీకులు ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో అనుష్క ప్రభాస్ పుట్టినరోజునాడు చేసిన ట్విట్ లో వాడిన పదాల పై ఇప్పడు బాలీవుడ్ మీడియాలో ఆలస్యంగా  అర్ధాలు వెతకడం మొదలైంది.
Prabhas and Anushka Shetty
ప్రభాస్ అనుష్కలు పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ ఇప్పటికే అనేకసార్లు వార్తలు సృష్టించిన బాలీవుడ్ మీడియా ఈమధ్య కేదర్‌నాథ్ ఆలయానికి కాలినడకన వెళ్ళిరావడం వెనుక ప్రభాస్ తో తన పెళ్లి త్వరగా జరగాలి అన్న ఆలోచనలతోనే అంటూ కామెంట్స్ వ్రాసింది బాలీవుడ్ మీడియా. అంతేకాదు అనుష్క రెండుసినిమాలకు ఓకె చెప్పినా ఇప్పుడు ఆసినిమాలను వదులుకోవడం వెనుక గల కారణం ప్రభాస్ పెళ్లి గురించి ఆమె పడుతున్న టెన్షన్ కారణం అంటూ కథనాలు వ్రాస్తోంది బాలీవుడ్ మీడియా. 
Prabhas and Anushka
ఈమధ్యన అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎందరో శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్విట్ లు చేసారు. వాటిలో అనుష్క ట్విట్ కూడ ఉంది.  సామాన్యంగా పుట్టినరోజునాడు శుభాకాంక్షలు చెపుతూ ‘హ్యాపీ బర్త్ డే’ అని చెపుతారు. అయితే అనుష్క తన ఇన్‌స్టాగ్రమ్‌ లో శుభాకాంక్షలు తెలియచేస్తూ ‘విష్ యు ఏ వేరీవేరీవేరీ హప్పు బర్త్ డే (Happu Birthday)..’ అంటూ మెసేజ్ పెట్టింది. ఈమెసేజ్ ని చూసిన చాలామంది అనుష్క పొరపాటున ‘హ్యాపీ’ అనడానికి బదులు ‘హప్పు’ అంటూ స్పెల్లింగ్ మిస్టేక్ తో ఈమెసేజ్ పెట్టి ఉంటుందని భావించారు చాలామంది. అయితే ఈమెసేజ్ వెనుక అంతర్లీనంగా ఎవరికీ అర్ధంకాని ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంది అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు వ్రాస్తోంది. 
Prabhas Got 6000 Proposals
అనుష్క సాధారణంగా ఎవరికీ ‘హప్పు’ బర్త్ డే అని విష్ చేయదు. ఆపదాన్ని కేవలం తనకుటుంబ సభ్యులకు మాత్రమే ఉపయోగిస్తోంది. ఈవిషయాన్ని పరిసోదన చేస్తూ అనుష్క గతంలో ఆమె సోదరులు తల్లికి చేసిన పుట్టినరోజు విష్‌ లను పరిశీలిస్తే అందులో ఆమె ‘హప్పుయెస్ట్ బర్త్‌డే’ అంటూ విష్ చేసిన సందర్భాలు చాలా కనిపించాయి. దీనితో ప్రభాస్ ను కూడ తనకుటుంబ సభ్యుడుగా భావించి ఇలా విష్ చేసి ఉంటుంది అంటూ బాలీవుడ్ మీడియా ఆసక్తికర కథనాలు వ్రాస్తోంది. దీనికితోడు ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆమె షేర్ చేసిన ఆమె పాదానికి సంబంధించిన ఫోటోలో పెళ్ళి అయిన తరువాత దక్షిణాది స్త్రీలు పాదం వేళ్ళకు పెట్టుకునే ‘మట్టెలు’ లా మూడు ఆకులు కలిసిన ఉన్న ఒకరేమ్మను మట్టేలా వెళ్ళమధ్యలో పెట్టుకుని ఆవిషయాన్ని క్లోజప్ లో పెట్టి తీయించుకున్న ఫోటోను షేర్ చేయడం వెనుక త్వరలో తాను ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతున్నాను అని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడమే అంటూ బాలీవుడ్ మీడియా వ్రాస్తున్న కథనం మరొకసారి ప్రభాస్ అనుష్కల పెళ్లి విషయాన్ని లైవ్ లోకి తీసుకు వచ్చింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: