భారత దేశంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ.  బరిలోకి దిగితే..దూకుడుతో ఆడుతూ అర్థసెంచరి, సెంచరీలు బాదేస్తుంటాడు.  ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో పాటు, నెటిజన్లు కోహ్లీని ఏకి పారేస్తున్నారు. తాజాగా హీరో సిద్దార్థ స్టార్ క్రికెట్ర్ విరాట్ కోహ్లీపై తనదైన స్టైల్లో విమర్శిస్తూ..ట్విట్ చేశాడు.  'కింగ్ కోహ్లీలా నీవు నిలవాలనుకుంటే... భవిష్యత్తులో ఏదైనా మాట్లాడే ముందు 'ద్రవిడ్ అయితే ఏం మాట్లాడతాడు?' అని నీకు నీవే ఆలోచించుకో.
Image result for siddhartha virat kohli
ఒక ఇండియన్ క్రికెట్ కెప్టెన్ నుంచి ఎలాంటి చెత్త మాటలు వచ్చాయి' అంటూ ట్వీట్ చేశాడు.  ఎప్పుడూ నెటిజన్లతో షెభాష్ అనిపించుకునే విరాట్ కోహ్లీ తన తాజా వ్యాఖ్యలతో అందరి దృష్టిలో పడ్డాడు.  ఇంతకీ అసలు విషయానికి వస్తే..ఈ నెల 5న విరాట్ కోహ్లీ తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు.  ఈ సందర్భంగా కోహ్లీ తన పేరుతో యాప్ ను లాంచ్ చేశాడు. 
Image result for hro siddarda
'కోహ్లీ ఓవర్ రేటెడ్ బ్యాట్స్ మెన్. అతని బ్యాటింగ్ లో ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇండియన్ల కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్ల బ్యాటింగ్ నే నేను ఎక్కువ ఆస్వాదిస్తా' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.  దానికి వెంటనే స్పందించిన కోహ్లీ ఆ అభిమానికి కాస్త ఘాటుగానే స్పందించాడు. 'నీవు ఇండియాలో నివసించాల్సిన అవసరం లేదు. వేరే దేశాలను ఇష్టపడే నీవు ఇక్కడెందుకు ఉంటున్నావు. వేరే ఏ దేశంలోనైనా నివసించు' అంటూ సమాధానమిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: