నేచురల్ స్టార్ గా నాని నటించిన సినిమాలు వరస విజయాలు సాధించడంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ ఎర్పరుచుకున్న టాప్ హీరోగా మారిపోయాడు. తనకు బాగా సూటయ్యే కథలతో ప్రేక్షకులను మెప్పించే విషయంలో నానీకి ఇండస్ట్రీ సక్సస్ సీక్రెట్ తెలిసినంతగా మరో హీరోకి తెలియదు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.  
Nani
ఈమధ్య రెండు అనుకోని పరాజయాలు నానీకి ఎదురైనా అతడి మార్కెట్ ఏమాత్రం చెక్కు చెదర లేదు.  రేడియో జాకీగా తన కెరీర్ ని మొదలు పెట్టిన నాని తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి ఆతరువాత టాప్ హీరోగా మారిన నాని ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబోలిలో కట్టుకున్న కొత్త ఇల్లు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. నాని పారితోషికం 10కోట్లు దాటిపోయిన నేపధ్యంలో ఆస్థాయిలోనే నానీ కొత్త ఇల్లు ఉన్నట్లు సమాచారం. 
nani-hit-flop-movies
ప్రస్తుతం నాని గచ్చిబౌలిలో అద్భుతమైన విల్లా కొనుగోలు చేసాడు. ఈ విల్లా ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ స్టైల్ లో నిర్మించడంతో దీన్ని చూసిన ప్రతిఒక్కరు ఇది ఫారెన్ స్టైల్ ఇల్లు
అని అంటూ నాని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.  నాని ఈ కొత్త ఇంటిని 10కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వెస్ట్రన్ దేశాల్లో ఉండే బీట్ హౌస్ ఎలా ఉంటుందో నాని ఇల్లు కూడా అలానే ఉంటుంది అంటున్నారు. బెల్జియం గ్లాస్ అవుట్ ఫిట్స్ తో ఉండే బాల్కనీలు పూర్తిగా చెక్కతో చేసి ఎంతో అందంగా కనిపించే పోర్టిగో అలాగే ఖరీదయిన కారిడార్ ఇలా దేనికదే ప్రత్యేకత ఉంది. 
Nani
హాల్ లో కి వెళ్తే ఫ్లోరింగ్ చూసిన వారికి దిమ్మ తిరుగుతుంది అవి పూర్తి చైనీస్ మార్బల్ స్టోన్స్ కావడంతో వాటిపై నడుస్తుంటే హిమాలయాల్లో నడుస్తున్న ఫీలింగ్ ఉంటుందట. ఇక వంట గది విషయానికొస్తే 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్' టెక్నాలజీ ఉపయోగించారు. 360 డిగ్రీలు కనిపించేలా ఇంటి పై భాగంలో పడక గది ఏర్పాటు చేశారు ఇంకా ఇంట్లోనే కసరత్తులు చేసుకోడానికి జిమ్ అలాగే స్పా మరియు మినీ థియేటర్ చూస్తే ఇంద్రభవనం తలపించే స్థాయిలో నాని కొత్త ఇల్లు ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో నాని కొత్త ఇంటి వ్యవహారం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: