టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్టులో చైతు సమంతలు ప్రధమ స్థానంలో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ చాల ప్రేమగా కనిపించే నేపధ్యంలో ఈ భార్యభర్తల ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయా అన్న అనుమానం కలగడం సహజం. 

అయితే సమంత చైతన్య కోపానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని ఈమధ్య లీక్ చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన సోషల్ మీడియా సమిట్ 2018 కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న సమంతను ఉద్దేసించి కొందరు ఎప్పుడైనా చైతన్య మీమీద అసహనంతో రగిలిపోయాడా అన్న ప్రశ్నకు సమంత ఊహించని సమాధానం ఇచ్చింది. 

గతంలో తమ ఇంట్లో చైతన్య తనకు వంట చేసి పెట్టినప్పుడు అ ఫోటోలను తాను ముచ్చట పడి సోషల్ మీడియాలో చైతన్యకు తెలియకుండా షేర్ చేసినప్పుడు చైతన్యకు విపరీతమైన కోపం వచ్చిన విషయాన్ని నవ్వుతూ చెప్పింది. కేవలం సరదా కోసం తాను వంట చేస్తే అందరికీ ఆవిషయాలు తెలియాలా అంటూ చైతు తనకు క్లాస్ పీకిన విషయాన్ని వివరించింది.

ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ ఏదైనా ఒక విషయంలో చైతన్యకు పట్టుదల వచ్చినప్పుడు తాను చెప్పిన సలహా కూడ చైతన్య పాటించాడని అందువల్లనే ఒకొక్కసారి తానే చైతూతో సద్దుకుపోతాను అంటూ మరొక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. దీనితో సమంత నోటి వెంట ఈ కామెంట్స్ విన్నవారు క్యూట్ సమంతకు చైతన్య అసహనంతో అప్పుడుప్పుడు కష్టాలు తప్పడం లేదు అని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: