విలన్ గా దుమ్మురేపుతుంది!
మరిన్ని

విలన్ గా దుమ్మురేపుతుంది!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీమణులు విలన్లుగా నటించాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు.  పాత తరం సినిమాల్లో గయ్యాలి అత్తగా సూర్యకాంతం నటించేవారు..అప్పట్లో ఆమెపై విమర్శలు కూడా వచ్చేవని టాక్.  మరికొంత మంది నటీమణులు విలన్లుగా కనిపించినా ఒకటీ రెండు సినిమాలతోనే సరిపెట్టుకునే వారు.  కానీ కోలీవుడ్ లో వరుసగా విలన్ పాత్రల్లో నటించి దుమ్మురేపుతుంది ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్.   హీరోయిన్ గా తన కెరీర్ మొదలు పెట్టిన వరలక్ష్మి ఆ మద్య ‘విక్రం వేద’లో గ్యాంగ్‌స్టర్‌గా నటించి అందరితో షెభాష్ అనిపించుకుంది.  అందం, అభినయం ఉన్నప్పటికీ విభిన్నమైన పాత్రలో కనిపించేందుకు ఉత్సాహపడే వరలక్ష్మి విలన్ పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత  ఇస్తుంది.