తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది నట వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే తెలుగు ఇండస్ట్రీలో రాజకీయ నేపథ్యంలో వచ్చిన హీరోలు చాలా అరుదు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోదరుడి తనయుడు నారా రోహిత్ ‘బాణం’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మంచి పర్సనాలిటీ, నటన ఉన్న నారా రోహిత్ మొదటి చిత్రం మంచి సక్సెస్ సాధించింది.  ఆ చిత్రం తర్వాత ఇప్పటి వరకు నారా రోహిత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ చిత్రం ఏదీ లేదనే చెప్పొచ్చు. 
Image result for banam movie
ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు నారా రోహిత్.  ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోల హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంతో మంచి హిట్ చిత్రం పడితే కానీ నారా రోహిత్ కి మనుగడ ఉండదు.  దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన ఒక కథను ఎంపిక చేసుకున్నాడు. 1971 నాటి యుద్ధానికి సంబంధించిన కథావస్తువుతో ఈ చిత్రం రూపొందనుంది.  గతంలో క్రిష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో 1940  రెండో ప్రపంచ యుద్దానికి సంబంధించిన చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 

ఇదే తరహాలో 1971 నాటి యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారట. ఈ చిత్రానికి చైతన్య దంతులూరి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.  ఇప్పటికే ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేశాడు. డిసెంబర్లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.  నారా రోహిత్ - చైతన్య దంతులూరి కాంబినేషన్ లో గతంలో ‘బాణం’ మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన చేయనున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: