విజయ్ దేవరకొండ మ్యానియా కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ కు కూడ ఎలా సోకిందో తెలియచేసే ఆసక్తికర సంఘటన ఈమధ్య లేటెస్ట్ గా జరిగింది.   శ్రీదేవి ముద్దుల కుమార్తెగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో అతిథిగా పాల్గొంటూ విజయ్ దేవరకొండ పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 
 సెక్సీ స్టార్
పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈషోలో పాల్గొంటున్న నేపధ్యంలో ఇటీవల అర్జున్ కపూర్ జాన్వీ కపూర్ లు కాఫీ విత్ కరణ్ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈషోలో రాపిడ్ ఫైర్ లో భాగంగా కరణ్ జోహార్ జాన్విని ఓ ప్రశ్న అడిగి ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు. ఒకరోజు ఉదయం నిద్రలేవగానే పురుషుడిగా మారిపోయే అవకాశం వస్తే ఎవర్ని ఎంచుకుంటావు అని అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ జాన్వి సమాధానం ఇచ్చింది.
కరణ్ జోహార్ నిర్మాణంలో
తానూ అనుకోకుండా పురుషుడుగా మారిపోవాలిసి వస్తే విజయ్ దేవరకొండ రూపంలోకి మారి పోతానని అంటూ విజయ్ లా మారి పోవాలని ఉంది అంటూ కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ ‘సెక్సీ సౌత్ ఇండియన్ స్టార్’ అంటూ ఎవరూ ఊహించని ట్యాగ్ ఇచ్చింది జాన్వి. అంతేకాదు అవకాసం వస్తే తాను తప్పకుండా విజయ్ దేవరకొండతో నటించే అవకాశాలను పరిశీలిస్తాను అంటూ తెలుగు సినిమా నిర్మాతలకు వ్యూహాత్మక ఫీలర్లు పంపుతోంది ఈ క్రేజీ బ్యూటి.
 విజయ్ దేవరకొండ గురించి
దీనితో ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ అభిమానులు పెట్టుకున్న ట్యాగ్ లు మారిపోయి భవిష్యత్ లో విజయ్ నటించే సినిమాల టైటిల్ కార్డ్స్ లో ‘సెక్సీ సౌత్ ఇండియన్ స్టార్’ అనే టైటిల్ కార్డు పడే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికే వరస విజయాలతో తనకు ఏర్పడ్డ ఇమేజ్ తో తన విమర్శకులకు మిడిల్ ఫింగర్ ను చూపెడుతూ తన ఇగోను చాటుకుంటున్న విజయ్ ఇప్పుడు జాన్వీ ఇచ్చిన ట్యాగ్ తో మరింత రెచ్చిపోయే ఆస్కారం ఉంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: