పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ నయా స్టార్ గా అవతరించాడు అన్నది ఒప్పుకోవాల్సిందే. బాలీవుడ్ మేకర్స్ సైతం విజయ్ గురించి మాట్లాడుకునే రేంజ్ లో మనవాడి క్రేజ్ విస్తరించింది. ఈమధ్యనే వచ్చిన టాక్సీవాలాతో మరోసారి సత్తా చాటిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్నాడు.


క్రేజీ పెయిర్ విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా కాబట్టి డియర్ కామ్రెడ్ మీద కూడా అంచనాలు పెరిగాయి. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 2019 ఫిబ్రవరిలో రానుంది. టాలీవుడ్ లో విజయ్ క్రేజ్ గురించి మాట్లాడే భామలు పెరుగుతున్నాయి. ఆరెక్స్ 100 సినిమాతో ప్రేక్షకులను అలరించిన పాయల్ రాజ్ పుత్ విజయ్ తో ఏకంగా పెళ్లికి రెడీ అని చెప్పగా.. హుషారు హీరోయిన్ కూడా విజయ్ మాయలో పడింది.


హుషారు అంటూ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది మరాఠి భామ హేమల్ ఇంగ్లె. తెలుగులో మొదటి అవకాశం అందుకున్న ఈ అమ్మడు సినిమాపై పూర్తి నమ్మకంగా ఉంది. హేమల్ ఇంగే కూడా విజయ్ మీద మనసు పారేసుకుంది. అతని స్టైల్, యాటిట్యూడ్ తనకు నచ్చుతాయని అంటుంది హేమల్.


ఛాన్స్ వస్తే అతనితో రొమాన్స్ కు రెడీ అంటుంది అమ్మడు. పాయల్ పెళ్లికి రెడీ అంటే, హేమ ఏకంగా రొమాన్స్ కూడా సై అనేస్తుంది. విజయ్ క్రేజ్ చూసి స్టార్స్ సైతం ముక్కున వేలేసుకునేలా ఉన్నారు. మరి వీరి కోరికలను విజయ్ తీరుస్తాడా లేదా అన్నది చూడాలి. యువ హీరోల్లో విజయ్ సినిమాల సెలక్షన్స్ మాత్రం అదిరిపోతుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: