ఎన్టీఆర్ ఫ్యామిలీ హీరోల తరువాత ఆరేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల కుటుంబాలలో అక్కినేని మూడవతరం హీరోలు మొదటి వరసలో కొనసాగుతున్నారు. యంగ్ హీరోల లిస్టులో ఈఅక్కినేని మూడవతరం హీరోలకు స్థానం లభించినా వారెవ్వరూ నాగార్జున స్థాయికి కనీసం దగ్గరలో కూడ లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. వీరికి నాగార్జున సపోర్ట్ తో పాటు వీరివెనుక అన్నపూర్ణా స్టూడియోస్ లాంటి భారీ నిర్మాణసంస్థ అండదండలు వీరికి లభించినా వీరి సినిమాలకు చెప్పుకోతగ్గ హిట్స్ రాకపోవడంతో వీరు ఎన్నిప్రయత్నాలు చేసినా ఇంకా పూర్తిగా సెటిల్ కాని యంగ్ హీరోల లిస్టులోనే కొనసాగుతూ ఉన్నారు.  

నాగార్జున ‘శివ’ లాంటి ట్రెండ్ సెట్టర్ మూవీ నుండి అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రం వరకు రకరకాల ప్రయోగాలు చేస్తూ సక్సస్ ఫుల్ హీరోగా గత మూడు దశాబ్దాలుగా తన కెరియర్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే దీనికి విరుద్దంగా అక్కినేని మూడవ తరం యంగ్ హీరోల కెరియర్ కొనసాగుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకదశాబ్దం క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్యకు ఒక హిట్ తగిలితే ఆతరువాత వరసగా ఫ్లాప్ లు వస్తున్న పరిస్థితి. 

ఇక అఖిల్ విషయానికి వస్తే అసలు హిట్ అన్న పదమే అఖిల్ వైపు చూడటం లేదు. వీరందరికన్నా ముందు సుమారు 19 సంవత్సరాల క్రితం టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కు అక్కినేని నాగేశ్వరావు నుండి నాగార్జున వరకు టోటల్ సపోర్ట్ లభించినా అతడు నటించిన సినిమాలలో అతి తక్కువ మాత్రమే విజయం సాధించడంతో పేరుకు మాత్రమే సుమంత్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇంచుమించు ఇలాంటి పరిస్థితి మరో అక్కినేని మనవడు సుశాంత్ కు కూడ కొనసాగుతోంది. ఇతడు కూడ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఒక దశాబ్దం కాలం అవుతున్నా ఇతడికి చెప్పుకోతగ్గ హిట్ దక్కడం లేదు. దీనితో టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రభావితం చేసే మార్కెట్ ను వారు అందుకోలేక పోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

అయితే ఇలా అక్కినేని మూడవతరం యంగ్ హీరోలు ఎంత ప్రయత్నం చేసినా టాప్ యంగ్ హీరోలుగా మారలేక పోవడానికి ప్రధానకారణం వారి సినిమాలకు సంబంధించి ఎంచుకుంటున్న కథలలో వైవిద్యం లేకపోవడంతో పాటు వారు నటిస్తున్న సినిమాల బడ్జెట్ వారి ఇమేజ్ స్థాయికి మించి ఉండటం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు టాలీవుడ్ దర్శకులు కూడ ఈఅక్కినేని యంగ్ హీరోలను ఎలా చూపించాలి అన్నవిషయమై క్లారిటీ మిస్ కావడంతో వీరికి వరస పరాజయాలు వస్తున్నాయి అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జున లాంటి టాప్ హీరోకి వారసులుగా వచ్చిన ఈముగ్గురు అక్కినేని మూడవతరం హీరోలు కనీసం 30కోట్ల కలక్షన్స్ మార్క్ ను ఇప్పటికీ అందుకోలేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. రేపువిడుదల కాబోతున్న సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ అయిన ఈట్రెండ్ కు బ్రేక్ వేయగలుగుతుందేమో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: