స్టోరీ లైన్, మ్యూజిక్స్టోరీ లైన్, మ్యూజిక్నరేషన్, ప్రొడక్షన్ వాల్యూస్, కాస్టింగ్
నాస్తికుడైన కార్తిక్ (సుమంత్) దేవాలయాల మీద పరిశోధనలు చేస్తుంటాడు. అయితే సుబ్రహ్మణ్యపురంలో వరుస ఆత్మహత్యల గురించి తెలుసుకున్న కార్తిక్ అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని కనిపెట్టాలని అనుకుంటాడు. అసలు సుబ్రహ్మణ్యపురంలో ఏం జరుగుతుంది. ఎందుకు అక్కడ అందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. దీనికి వెనుక కారణాలు ఏంటి. వాటిని కార్తిక్ ఎలా కనిపెట్టాడు అన్నది సినిమా కథ. 



సుమంత్ ఎప్పటిలానే తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే అతన్ని దర్శకుడు సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు. ఈషా రెబ్బ కూడా బాగానే చేసింది. సురేష్ నటన మెప్పించింది. కమెడియన్స్ కామెడీ బాగుంది.



ఆర్ కె ప్రతాప్ సినిమాటోగ్రఫీ సోసోగానే ఉంది. కెమెరా వర్క్ ఓకే అనేలా ఉండగా శేఖర్ చంద్ర మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. బిజిఎం ఆకట్టుకుంది. అయితే దర్శకుడు సంతోష్ జాగర్లమూడి రాసుకున్న కథ పర్వాలేదు అన్నట్టుగా ఉన్నా దాన్ని నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే దారుణంగా ఉన్నాయి.



సుబ్రహ్మణ్యపురం అనే ఊరు.. అందులో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటికి కారణం ఏంటని తెలుసుకోవాలని వచ్చిన హీరో.. స్టోరీ లైన్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ట్రైలర్ కూడా బాగానే కట్ చేశారు. అయితే సినిమాను మాత్రం ఆసక్తికరంగా మలచడంలో విఫలమయ్యాడు దర్శకుడు సంతోష్.


సినిమా అంతా ఆడియెన్స్ పేషెన్సీని టెస్ట్ చేసేలా ఉంటుంది. నిర్మాణ విలువలు కూడా ఏం బాగాలేదు. లీడ్ పెయిర్ లవ్ ట్రాక్ మెప్పించలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగాల్సిన ఈ సినిమాలో కామెడీ కూడా ఆకట్టుకోలేదు. సినిమా లైన్ బాగున్నా దర్శకుడు స్క్రీన్ ప్లే అసలేమాత్రం ఆకట్టుకునేలా తీయలేదు.


సినిమా మొదలైనప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించినా రాను రాను సినిమా చాలా సాగదీసినట్టుగా అవుతుంది. మంచి కథనం రాసుకుంటే ఈ సినిమా తప్పకుండా బాగుండేది.



సుమంత్ అక్కినేని, ఈషా రెబ్బా, సంతోష్ జాగర్లపూడి,బీరం సుధాకర్ రెడ్డి,శేఖర్ చంద్రసుబ్రహ్మణ్యపురం.. నిరాశపరచింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: