గత నెల అసెంబ్లీ రద్దు తర్వాత తెలంగాణలో ప్రచారాలో జోరందుకున్నాయి.  ప్రచారంలో ఆయా పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి ఓటింగ్ అడుగుత తాము చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేశారు.  ఇక టీఆర్ఎస్ తాము చేసిన అభివృద్ది పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈసారి టీఆర్ఎస్ ని మట్టి కరిపించాలని మహాకూటమి జోరుగా ప్రచారం చేసింది.  ఇక మహాకూటమిలో భాగస్వామ్యం అయిన టీటిడిపి తరుపు నుంచి ఏపి సీఎం చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నందమూరి తారకరత్న, నందమూరి జానకిరామ్ భార్య ప్రచారం చేశారు. నిన్నటితో తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
Image result for kukatpally balakrishna suhasini
అయితే కూకట్ పల్లి నియోజకవర్గం నుండి నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న సందర్భంగా ఆమె కోసం ప్రచారం చేస్తూ బాలకృష్ణ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాలకృష్ణ.. ఎన్టీఆర్ తనకు కూడా కొడుకే అంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.  కాగా, సుహాసిని కోసం ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడని అంతా అనుకున్నారు కానీ ఎన్టీఆర్ అలా చేయలేదు..ఈ విషయంపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు.  సుహాసిని కోసం ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ రావాల్సిన అవసరం లేదు. 
Image result for balakrishna ntr
ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చుకుంటున్నాడ..ఇక ప్రచారం కొనసాగిస్తే  కొంతమంది నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్ ప్రచారం చేస్తే..ప్రమాదానికి గురయ్యాడని..ప్రచారం అంతగా కలిసిరాలేదు. ఆ భయంతోనే నేను తారక్ ని ప్రచారానికి రావొద్దని అన్నాను. తారక్ నా అన్న కొడుకు మాత్రమే కాదు.. నాకు కూడా కొడుకే. నా కొడుకు మోక్షజ్ఞ ఎందుకు ప్రచారానికి రాలేదు.. జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకే రాలేదు అన్నారు.  ఈ విషయంపై నందమూరి ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: