ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ లోని ఒక కీలక పాత్ర కోసం రాజమౌళి తరఫున ప్రభాస్ ఒక సంచలన హీరోతో మంతనాలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కన్నడ సూపర్‌స్టార్ యష్ ను ముంబైలో కలుసుకోవడం బాలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది.
ప్రస్తుతం ముంబైలో
ప్రస్తుతం ‘సాహో’ పనుల నిమ్మితం ముంబైలో ఉన్నాడు. ‘కేజీఎఫ్’ మూవీ ప్రమోషన్ కోసం ముంబాయిలో ఉన్న యష్ ను కలవడం అతడితో సుదీర్ఘంగా చర్చించడం ఇది అంతా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కోసమే అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ యష్ మార్కెట్ కేవలం శాండల్‌వుడ్‌కే పరిమితం. కానీ కేజీఎఫ్ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎట్రాక్షన్‌గా మారిన నేపధ్యంలో ఈమూవీని పలు భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. 
కేజీఎఫ్‌పై భారీ అంచనాలు
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కూడ పలు భాషలలో విడుదల కాబోయే సందర్భంలో కన్నడంలో విపరీతమైన క్రేజ్ ఉన్న యష్ ను ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఒక కీలక నెగిటివ్ పాత్రకు ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు రాజమౌళికి ఉన్నట్లు టాక్. ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో ‘కేజీఎఫ్’ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌గా అంచనాలను పెంచుకొన్న నేపధ్యంలో యష్ కు దక్షిణాది అంతా అభిమానులు ఏర్పడ్డారు. 
 కంటెంట్ బాగుంటే సినిమాను
దీనితో రాజమౌళి దృష్టి ఇప్పటికే యష్ పై పడింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈపరిస్తుతుల నేపధ్యంలో ప్రభాస్ యష్ ల మధ్య జరిగిన కీలక సమావేశం మరింత ప్రాధాన్యతను సంపాధించుకుంది. హీరోలను మించి ప్రతి నాయకుడి పాత్ర ఇమేజ్ ని సృష్టించే రాజమౌళి చేతిలో యష్ పడితే అతడు కూడ రానా లా నేషనల్ సెలెబ్రెటీ కావడం ఖాయం..   



మరింత సమాచారం తెలుసుకోండి: