ఒక మీడియా సంస్థకు నాగబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారడంతో ఆ ఇంటర్వ్యూలో నాగబాబు వ్యక్తపరిచిన అభిప్రాయాల పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో కేవలం పవన్ గురించి చిరంజీవి గురించి చెప్పడమే కాకుండా తమ కుటుంబంలోని యంగ్ హీరోలకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు నాగబాబు. 
అశ్వినీ దత్ అనుకున్నాం
ముఖ్యంగా రామ్ చరణ్ కు వచ్చినంత సులువుగా తన కొడుకు వరుణ్ తేజ్ కు ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదని మొదట్లో చరణ్ తో సినిమాలు తీయాలని చాలామంది నిర్మాతలు ప్రయత్నిస్తే తన కొడుకు వరుణ్ తేజ్ విషయంలో మాత్రం ఆ నిర్మాతల సంఖ్య చాల తక్కువ అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు నాగబాబు. దీనికి కారణం తాను చిరంజీవి తమ్ముడుని మాత్రమే కాని చిరంజీవిని కాను అన్న విషయం తనకు తెలుసు అంటూ సంచలన కామెంట్స్ చేసాడు నాగబాబు.
ఇన్వాల్వ్ కానివ్వడు
ఇదే సందర్భంలో తన కొడుకు వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ అతడు నటించే సినిమాల కథల ఎంపికలో తన సలహాలు ఏమి అడగడనీ కేవలం పది మందికి తెలిసిన తరువాత మాత్రమే తన కొడుకు నటించబోయే సినిమాల కథలు తనవరకు తెలుస్తాయి అంటూ వరుణ్ తేజ్ ప్రవర్తన పై షాకింగ్ కామెంట్స్ చేసాడు ఈ మెగా బ్రదర్.  అంతేకాదు ప్రస్తుతం తన కొడుకు సంపాదన ఏనుగు స్థాయిలో ఉంటే తన సంపాదన చీమ స్థాయిలో ఉందనీ అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు నాగబాబు.
 నిహారిక కంటే
అయితే తన కొడుకు హీరో అయినా తన ఇంటికి సంబంధించిన ప్రతి ఖర్చు తానే ఖర్చు పెడతానని ఇప్పటికీ వరుణ్ తేజ్ కు సంబంధించిన పోకేట్ మనీ తానే ఇస్తున్నట్లు వివరించాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఇస్తూ తన కూతురు నిహారిక సంపాదన కంటే తన సంపాదన ఎక్కువ అని జోక్ చేస్తూ నిహారిక నటిగా స్థిర పడటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఇంకా సరైన సక్సస్ రాకపోవడం తనను బాధ పెడుతోంది అంటూ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసిన నాగబాబు ఇంటర్వ్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: