రజినీకాంత్ ‘2.0’ మూవీ కలక్షన్స్ 600 కోట్ల దగ్గర ఆగిపోవడంతో ఈమూవీ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ఆశ పడ్డ రజినీకాంత్ అభిమానుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. దీనితో ప్రస్తుతం రజినీ అభిమానుల దృష్టి అంతా వచ్చే నెల సంకాన్తికి విడుదల కాబోతున్న ‘పేట’ సినిమా పై ఉంది. 

ఈలోపుగా డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు వస్తూ ఉండటంతో ఆరోజు రజినీకాంత్ పెట్టబోతున్న పార్టీ పేరును ఏదైనా ప్రకటిస్తాడా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పటికే రజినీ స్వయంగా ప్రకటించినా ఆపార్టీ ఎప్పుడు ప్రారంభం అవుతుందని వచ్చే ఏడాది జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో రజినీకాంత్ పార్టీ పోటీ చేస్తుందా అన్న విషయమై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేని పరిస్థుతులలో రజినీ ఉండిపోయాడు. 

ఇండియాలో ఏ సూపర్ హీరోకి లేని స్థాయిలో దాదాపు 40వేల రజినీకాంత్ అభిమాన సంఘాలు తమిళనాడు యావత్తు ఉన్నాయి అంటే రజినీకాంత్ స్టామినా ఏమిటో అర్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థుతులలో రజినీకాంత్ ముఖ్యమంత్రి పదవి ఆశలు నిజం అయినా కాకపోయినా వెండి తెర పై మాత్రం రజినీ ముఖ్యమంత్రిగా అతిత్వరలో కనిపించబోతున్నాడు. ‘సర్కార్’ విజయ్ తరువాత దర్శకుడు మురగదాస్ చెప్పిన పొలిటికల్ మూవీ స్టోరీ లైన్ రజినీకాంత్ కు నచ్చడంతో ఈమూవీ షూటింగ్ వచ్చేనెల సంక్రాంతిరోజున మొదలు కాబోతోంది. 

ఈమూవీలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడ ఉంటాయని టాక్. రజినీకాంత్ పెడుతున్న పార్టీ సిద్దాంతాల ప్రచారానికి అనువుగా ఈమూవీలోని పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయని అంటున్నారు. వాస్తవానికి గతంలో శంకర్ హీరో అర్జున్ తో తీసిన ‘ఒకే ఒక్కడు’ మూవీలో ఉండే ఒక్కరోజు ముఖ్యమంత్రి పాత్రను చేయమని అప్పట్లో శంకర్ రజినీకాంత్ ను అడిగినప్పుడు ఆ ప్రాజెక్ట్ ను రజినీ తిరస్కరించాడు. అయితే అదే రజినీకాంత్ తన మనసు మార్చుకుని శంకర్  దర్శకత్వంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు అంటే ముఖ్యమంత్రి పదవి పై రాజినీకాత్ ఆలోచనలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో అర్ధం అవుతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: