ఈ మద్య టాలీవుడ్ లో కమెడియన్ల సంఖ్య బాగా పెరిగిపోతుంది.  బ్రహ్మానందం, ఆలి లాంటి కమెడియన్లు సీనియర్లు అవుతున్న నేపథ్యంలో కొత్త కమెడియన్లు ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా జబర్ధస్త్ కామెడీ షోలో బాగా పాపులర్ అయిన కమెడియన్లు వెండితెరపై రాణిస్తున్నారు.  యూట్యూబ్ లో తన ప్రస్థానం మొదలు పెట్టి..సంపత్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’సినిమాతో పరిచయం అయిన రాహూల్ రామకృష్ణ ఇప్పుడు బిజీ కమెడియన్ల గా మారిపోయాడు.  తెలంగాణ యాస..సహజన నటన రాహూల్ రామకృష్ణ ప్లస్ పాయింట్స్.  ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘హుషారు’. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. 
Image result for comedian rahul ramakrishna arjun reddy
ఈ సందర్భంగా రాహూల్ రామకృష్ణ మాట్లాడుతూ..అర్జున్ తర్వాత ఎక్కువ నిడివి కలిగిన పాత్రలో నేను నటిస్తున్న సినిమా. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలే తప్ప ఇంకేం ఉండవనే సందేశంతో దర్శకుడు శ్రీహర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Image result for husharu movie
ఈ సినిమాలో సాఫ్ట్ ఇంజనీర్ నటించాను. ఉద్యోగం అంటే ఇష్టం ఉండదు. కానీ విధిలేని పరిస్థితుల్లో ఆ వృత్తిని చేపట్టిన అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఓ నలుగురు యువకులతో అతడికి ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమాలో ఆసక్తిని పంచుతుంది. 

ఈ సినిమాలో సెకండాఫ్ నుంచి నేను ఎంట్రీ ఇస్తాను.  ఈ సినిమాలో ‘పిచాక్..’పాటకు మంచి స్పందన లభిస్తున్నది. ‘భరత్ అనే నేను’లో నా పంథాకు భిన్నంగా కనిపించాను.  నాకు దర్శకత్వంపై మనసు లేదు..అలా అని హీరో ఛాన్స్ వచ్చినా నటించలేను..ఎందుకంటే నాకు డ్యాన్స్, ఫైట్స్ రావు.  సందీప్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘నిను వీడని నీడను నేను’ సినిమాలో విలన్ నటిస్తున్నాను. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’లో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి’తో పాటు శ్రీవిష్ణుతో మరో సినిమా చేయబోతున్నాను’అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: