ప్రపంచం అంతటా ఉగ్రవాదం వైరస్ లో పాతుకు పోతుంది.  ఎంతో మంది అమాయకులు వీరి దాడుల్లో మరణిస్తే..వేల సంఖ్యలో అనాధలు, వికలాంగులుగా మిగిలిపోతున్నారు.  లక్ష్యం ఎవరైనా వీరి చేతుల్లో అమాయకులు బలిఅవుతున్నారు. అయితే ఉగ్రవాదం పై ఆకర్షించడానికి చిన్ననాటి నుంచే ట్రైనింగ్, ప్రలోభ పెట్టడం వంటివి చేస్తుంటారు.  కొంత మంది బలవంతంగా ఉగ్రవాదం వైపు లాగుతున్నారు.  ఇక ఉగ్రవాద నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి.  తాజాగా జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రంలో  ఈరోజు భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది.
Saqib Bilal, 15-year old boy who once acted in Haider, killed in an encounter along with his 14-year old friend Mudasir
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  గత కొంత కాలంగా పంజాబ్, జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  గత కొన్ని రోజుల నుంచి భారత సైనికులకు ఉగ్రవాదులకు మద్య భీకర పోరాటం జరుగుతుంది. అయితే చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు గతంలో బాలీవుడ్‌ సినిమాలో నటించడం విశేషం. 2014లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమా‘హైదర్’లో నటించాడు.  ఈ చిత్రంలో షాహిద్ కపూర్ చిన్ననాటి పాత్రలో మరణించిన ఉగ్రవాది నటించాడు. 
ఉగ్రవాదిగా మారిన హైదర్ సినిమా హీరో, ఎన్‌కౌంటర్‌లో హతం
బిలా రాష్ట్రంలోని బాండీపొరాలోని సోపోర్‌లో ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా దళాలకు పక్కా సమాచారం అందింది.  దాంతో ఉగ్రవాదులు ఉన్న చోటిని చుట్టు ముట్టగా వారు ప్రతిఘటించారు..ఎదురు కాల్పులు చేయడం మొదలు పెట్టడంతో..భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు 17 ఏళ్ల షకీబ్ బిలాల్ అహ్మద్ కాగా, మరొకరు ముదసిర్ అహ్మద్ అనే 14 ఏళ్ల బాల ఉగ్రవాది.


మరింత సమాచారం తెలుసుకోండి: