సూపర్ స్టార్ రజినికాంత్ 2.ఓ థియేటర్స్ లో సందడి చేస్తుండగా ఇప్పుడు మరో సినిమా సంక్రాంతికి రాబోతుంది. కేవలం నాలుగు సినిమాల అనుభవం ఉన్న కార్తిక్ సుబ్బరాజు రజినితో పెట్ట సినిమా చేశాడు. అతని మొదటి సినిమా పిజ్జా సూపర్ హిట్ అయ్యింది. ఆ టైంలో ఎవరో ఫోన్ చేసి రజిని సార్ మాట్లాడతారని చెబితే తన స్నేహితులే ఎవరో ఆట పట్టిస్తున్నారని అనుకున్నా కాని రజిని సార్ నిజంగా ఫోన్ చేసి సినిమా బాగా తీశావని మెచ్చుకున్నారని చెప్పాడు కార్తిక్.


ఇక జిగుర్ తండా సినిమా కూడా రజిని సార్ చూస్తే బాగుండని ఆయనకు చూపిద్దామని అనుకోగా ఆల్రెడీ ఆయన సినిమా చూసి మెచ్చుకున్నరని తెలిసింది. ఆ సినిమా టైంలోనే రజినిని కలిశానని చెప్పుకొచ్చాడు కార్తిక్ సుబ్బరాజు. ఇక ఆ టైంలో తను రజిని సార్ ఆటోగ్రాఫ్ తీసుకోవడం మర్చిపోయానని.. అందుకే వేరే సినిమా షూటింగ్ లో ఉండగా నా డైరీ సర్ దగ్గరకు పంపించానని.. అయితే ఖాళీగా ఉండటం వల్ల రజిని సార్ తనని రమ్మని పిలిచారని అన్నాడు కార్తిక్.


ఆ టైంలోనే తన దగ్గర ఏదైనా కథ ఉంటే చెప్పమని రజిని అడిగారట. రజిని లాంటి స్టార్ తనని అలా అడగడం మిరాకిల్ గా అనిపించగా ఆ తర్వాత కొద్దిరోజులకే పెట్ట కథ వినిపించానని రజిని సార్ కు అది నచ్చిందని చెప్పాడు కార్తిక్. అయితే రజిని పాలిటిక్స్ లోకి వస్తుండటంతో తన సినిమా కల నెరవేరదని అనుకున్నా కాని మొత్తానికి సినిమా చేశామని అన్నాడు కార్తిక్.


పెట్ట మూవీ టీజర్ చూస్తే రజిని మార్క్ స్టైలిష్ సినిమాగా ఉంటుందని అనిపిస్తుంది. కచ్చితంగా రజిని ఫ్యాన్స్ అందరు ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నాడు కార్తిక్ సుబ్బరాజు. రజిని ద్విపాత్రాభినయం చేస్తున్న పెట్ట మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత రజిని మురుగదాస్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని కోలీవుడ్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: