ప్రస్తుతం అమెరికాలో పర్యటన చేస్తూ అక్కడి ఎన్నారైలతో కలిసి ‘జనసేన’ సిద్ధాంతాలను పరిచయం చేస్తూ నిర్వహించిన ‘ప్రవాసాంధ్ర గర్జన’ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అనేక ఆసక్తికర విషయాల పై స్పందిస్తూ మధ్యలో సిక్స్ ప్యాక్ కల్చర్ పై కూడ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తన జీవితంలో ప్రతీ రోజు తాను భయపడే పనిని చేస్తాను అని అంటూ తనకు భయాన్ని కలిగించే అంశంపై అధిపత్యం కొనసాగించాలని కోరిక అన్న విషయాన్ని బయటపెట్టాడు.
అప్పుడు అసహ్యమేసింది
అంతేకాదు తన ఊహ తెలిసినప్పటి నుంచి తాను దేనికైతే భయపడతానో ఆ విషయాన్ని తాను తప్పకుండా చేస్తాను అంటూ భయాన్ని జయించడం తన హాబీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఇదే సందర్భంలో ప్రస్తుత తరం యూత్ కు మ్యానియాగా మారిన సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ గురిమ్హి మాట్లాడుతూ ధైర్యం అంటే కండలు పెంచడం కాదనీ ధైర్యం పెరగాలి అంటే మనిషి పిరికి తనాన్ని జయించాలి అంటూ తమ ఫిలిం ఇండస్ట్రీలో కూడ ఈ సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ కల్చర్ బాగా పెరిగిపోయింది అంటూ పరోక్షంగా హీరోలకు చురకలు అంటించాడు పవన్ కళ్యాణ్.
నాకు అవి సమాధానం చెప్పలేకపోయాయి
ఇదే సందర్భంలో భయం గురించి మరింత లోతుగా మాట్లాడుతూ ప్రతి మనిషికీ భవిష్యత్ మీద భయం ఉండటం చాలా సహజం అని అంటూ సమస్యలతో పోరాడాలి అంటే ముందుగా మనిషి భయాన్ని జయించాలి అంటూ అమెరికా డల్లాస్ ప్రాంతలో యువతకు పిలుపు ఇచ్చాడు పవన్.  ఇక తన సినిమాల కెరియర్ గురించి మాట్లాడుతూ గతంలో తాను మొదలు పెట్టి ఆపేసిన సత్యాగ్రహి సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. 
గుండె ధైర్యాన్ని పెంచడానికి
ఆసినిమా కథలో హీరో తాను నిజ జీవితంలో ఏమి చేస్తున్నానో అవే పనులు సత్యాగ్రహి సినిమా కథలో హీరో చేస్తాడనీ అంటూ సినిమాలలో హీరోలు పోరాటం చేస్తే జనం కష్టాలు తీరవు అంటూ మరొకసారి మాస్ హీరోల సినిమాల కథల పై సెటైర్లు వేసాడు పవన్. నిజ జీవితంలో తాను ప్రజల మధ్య పోరాటం చేయాలని నిశ్చయించుకున్న నేపధ్యంలో తాను సినిమాలకు దూరం అయ్యాను అంటూ తాను నటించడానికి ఇష్టపడితే ఫిలిం ఇండస్ట్రీలో ఏహీరోకి రానంత భారీ పారితోషికం తనకు వచ్చే ఆఫర్లు ఉన్నాయి అంటూ ప్రజల కోసం తాను చేసిన త్యాగాలను సవివరంగా వివరించాడు పవన్ కళ్యాణ్..   


మరింత సమాచారం తెలుసుకోండి: