కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన సినిమా మారి సూపర్ హిట్ అవగా ఆ సినిమాకు సీక్వల్ గా మారి-2 కూడా చేశాడు ధనుష్. డిసెంబర్ 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగులో కూడా అదేరోజున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.


ధనుష్ లోని ఊర మాస్ యాంగిల్ చూపించిన మారి తమిళ తంబీలను మెప్పించింది. అయితే తన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేసే ధనుష్ మారి-2ని తెలుగులో రిలీజ్ ప్లాన్ చేశాడు. అయితే అనుకున్న రిలీజ్ డేట్ నాడు అంటే డిసెంబర్ 21న రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి. అందులో వరుణ్ తేజ్ అంతరిక్షం ఒకటి కాగా.. మరోటి శర్వానంద్ పడి పడి లేచే మనసు.


రెండు డిఫరెంట్ జానర్ సినిమాలే అవడంతో ఆ రెండు సినిమాల మీద తెలుగు ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. అంతేకాదు కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా తెలుగు, తమిళ, కన్నడలో కె.జి.ఎఫ్ సినిమా వస్తుంది. ఆ సినిమా ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచింది. ఇప్పటికే ఆ 3 సినిమాలు డిసెంబర్ 21న బాక్సాఫీస్ ఫైట్ కు దిగుతుంటే మారి-2 కూడా ఆ ఫైట్ లో చేరుతుంది.


తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ మారి-2ని ఓ వారం తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పినా కాదు కుదరదు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని అంటున్నాడట ధనుష్. ఈ పంతం దేనికో తెలియదు కాని దాని వల్ల తెలుగు డిస్ట్రిబ్యూటర్ కు మాత్రం నష్టం జరుగుతుంది. మరి ధనుష్ మారి-2 ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: