సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ కింగ్ గా కొనసాగుతున్నాడు. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ మదుకుంటున్న పారితోషికాలు దక్షిణాది సినిమా రంగంలో ఏ హీరోకి లేవు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహేష్ స్థానానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ చెక్ పెడుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

మహేష్ తరువాత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అమ్మాయిలలో విపరీతమైన క్రేజ్ ఉన్నది ప్రస్తుతం విజయ్ దేవరకొండకు మాత్రమే. ఈవిషయం చాల మల్టీ నేషనల్ కంపెనీల దృష్టి వరకు వెళ్ళడంతో కొన్ని కంపెనీలు తమ ప్రోడక్స్ ప్రమోషన్స్ కు ప్రస్తుతం విజయ్ దేవరకొండను సంప్రదిస్తున్నట్లు సమాచారం. 

ఈ విషయంలో ఆ కంపెనీల యాజమాన్యాలకు విజయ్ వెంటనే స్పందించాడమే కాకుండా ఇతడు కోట్ చేస్తున్న పారితోషికాలు కూడ మహేష్ స్థాయిలో కాకుండా బాగా తక్కువగా ఉండటంతో చాల కంపెనీలు తమ ప్రోడక్ట్ పబ్లిసిటీని విజయ్ దేవరకొండ ద్వారా చేయించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు టాక్. దీనికితోడు ఈ క్రేజీ హీరోకు ప్రస్తుతం యూత్ లో అదేవిధంగా అమ్మాయిలలో ఏర్పడ్డ క్రేజ్ తో తమ ప్రొడక్ట్స్ ను చాల సులువుగా జనం మధ్యకు తీసుకు వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనలలో చాల కంపెనీలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే రాబోయే సమ్మర్ ను దృష్టిలో పెట్టుకుని ఒక శీతలపానీయ సంస్థ విజయ్ తో ఒక యాడ్ చేయడానికి డిసైడ్ అయినట్లు టాక్. దీనికితోడు మరో నాలుగు ప్రముఖ మల్టీ నేషనల్ సంస్థలు విజయ్ దేవరకొండతో చర్చలు జరుపుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో మహేష్ స్థానానికి ఎర్త్ పెట్టే ఆలోచనలలో విజయ్ దేవరకొండ వ్యూహాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: