యశ్ నిర్మాణ విలువలు బిజిఎంయశ్ నిర్మాణ విలువలు బిజిఎంఔట్ డేటెడ్ స్టోరీ స్క్రీన్ ప్లే ఎడిటింగ్
పుట్టినప్పుడు ఎలాగోలా పుడతాం అది మన చేతుల్లో ఉండదు కాని పోయేప్పుడు ధనవంతుడిగా పోవాలి.. తన తల్లి చెప్పిన మాటలను బాగా ఎక్కించుకున్న రామకృష్ణ పవన్ అలియాస్ రాకీ (యశ్) చిన్నప్పటి నుండి ఆ కసితోనే పెరుగుతాడు. శెట్టి సహాయంతో ముంబై స్మగ్లింగ్ చేస్తూ వచ్చే రాకీ ఆఫ్రికా నుండి ఇంపోర్ట్ అవుతున్న దొంగ బంగారం మీద ఆధిపత్యం చెలాయించేలా డాన్ గా మారతాడు. ఈలోగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుండి తనకో అసైన్మెంట్ వస్తుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ను తన ఆదీనంలో ఉంచుకున్న గరుడని చంపాలని యశ్ కు డీల్ వస్తుంది. కె.జి.ఎఫ్ ను తన ఆదీనంలో తెచ్చుకోవాలనుకున్న రాకీ ప్లాన్ ఏమైంది. అక్కడ తనకు ఎదురైన అనుభవాలు ఏంటి అన్నది సినిమా కథ.

కన్నడలో స్టార్ హీరో అయిన యశ్ తన నటనతో మెప్పించాడు. హీరోగా అతని కోసం కొన్ని కమర్షియల్ సీన్స్ బాగా ప్లాన్ చేశారు. హీరోయిన్ శ్రీనాథ్ శెట్టి పెద్దగా ఆకట్టుకోలేదు. తమన్నా ఐటం సాంగ్ పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. రామచంద్ర రాజు విలనిజం బాగుంది. వినయ్ బిడప్పా, దినేష్ మంగళూరు,అవినాష్, హరీష్ రాయ్, వశిష్ట ఇలా అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు. 

భువన గౌడ సినిమాటోగ్రఫీ బాగుంది. కోలార్ బంగారు గనుల బ్యాక్ డ్రాఫ్ లో కెమెరా వర్క్ బాగుంది. కలర్ స్కీం అలరించింది. మ్యూజిక్ డైరక్టర్ రవి బస్నూర్ తనిష్క్ ల పనితనం మెప్పించింది. బిజిఎం ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. కథ, కథనాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. 

కొన్ని సినిమాలు కథలుగా బాగుంటాయి కాని తెర మీద అంతగా ఇంప్రెస్ చేయలేవు.. కొన్ని కథలు వినేందుకు బాగుండెవు కాని సినిమాగా బాగా వస్తాయి. అయితే ఇక్కడ కథగా రాసుకున్న ఫీల్, ఇంటెన్సిటీ తెర మీద కనిపించకపోతే అది ఎంత పెద్ద బడ్జెట్ మూవీ అయినా వర్క్ అవుట్ అవదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వస్తున్న సినిమాగా కె.జి.ఎఫ్ బాగా హైప్ క్రియేట్ చేసుకుంది.

అయితే ఆ అంచనాలకు తగినట్టుగా సినిమా లేదని చెప్పొచ్చు. తెలుగు ప్రేక్షకులకు కొత్తవాడైన యశ్ సాహసాలు.. బిల్డప్ సీన్స్ తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కవు. కథ పరంగా బాగానే రాసుకున్నా కథనంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్రాక్ తప్పాడు. సినిమాకు ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగా వచ్చేది.

ఇప్పటికైనా సరే సినిమా మంచి ప్రయత్నమే అని చెప్పొచ్చు. యశ్ చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. చాప్టర్ 1 అలా ముగించగా ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందని క్లూ ఇచ్చినట్టు ఉంది. మాస్ ఆడియెన్స్ కు ఎక్కువగా నచ్చే యాక్షన్ సీన్స్ తో వచ్చిన ఈ కె.జి.ఎఫ్ తెలుగు ప్రేక్షకులకు అంతంత మాత్రంగానే నచ్చుతుంది.


యష్, శ్రీనిధి శెట్టి, రమ్యకృష్ణ, ప్రశాంత్ నీల్, విజయ్‌ కిరంగధూర్‌, రవి భసూర్‌యశ్ కె.జి.ఎఫ్.. అంచనాలను అందుకోలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: