ఈ ఇయర్ నాని చేసిన రెండు సినిమాలు నిరాశపరచడంతో మళ్లీ కథల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు మన నాచురల్ స్టార్. అన్ని ఒకే రకమైన సినిమాలు అవుతున్నాయని రాజమౌళి లాంటి దర్శకులే కామెంట్ గా చెప్పడంతో నాని మరింత జాగ్రత్త వహిస్తున్నాడు. ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తున్న నాని తన తర్వాత సినిమా విక్రం కుమార్ తో లైన్ లో పెట్టాడు.


హలో సినిమా తర్వాత అల్లు అర్జున్ తో విక్రం సినిమా ఉంటుందని అనుకున్నారు కాని అది క్యాన్సిల్ అయ్యింది. విక్రం కుమార్ తో నాని ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ మూవీ కాకుండానే మరో రెండు సబ్జెక్ట్స్ ఫైనల్ చేశాడట నాని. లాస్ట్ ఫ్రైడే రిలీజైన పడి పడి లేచె మనసు దర్శకుడు హను రాఘవపుడితో నాని ఓ సినిమా చేయాల్సి ఉంది.


మిలిట్రీ బ్యాక్ డ్రాప్ తో ఓ భారీ బడ్జెట్ మూవీనే ప్లాన్ చేశాడు హను. అయితే అటు ప్రేమకథలను, ఇటు కమర్షియల్ స్నీమాలను డీల్ చేయడంలో హను ఫెయిల్ అవుతున్నాడు. ఈ క్రమంలో నాని హనుతో రిస్క్ చేస్తాడా అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. నాని ఈ సినిమా చేయడం తన కెరియర్ మళ్లీ రిస్క్ లో పడేసుకున్నట్టే అని సలహా ఇస్తున్నారు.


హను ఏమాత్రం ఫాంలో లేడు. అలాంటి హను రాఘవపుడి నానితో సినిమా చేసి హిట్ కొడతాడా అని డౌట్ పడుతున్నారు. పడి పడి లేచె మనసు హిట్ కొడితే ఏమో కాని అది కూడా మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. మరి హనుతో నాని సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. హను రాఘవపుడి మాత్రం నాని సినిమా కన్ ఫాం అంటున్నాడు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో కృష్ణ గాడి వీర ప్రేమగాథ మూవీ వచ్చి హిట్ అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: