‘బాహుబలి’ ప్రాజెక్ట్ తో నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిపోయిన రాజమౌళి పై బాలీవుడ్ మీడియాకు ప్రత్యేక దృష్టి ఉంది. అందువల్ల రాజమౌళి ఏమి మాట్లాడినా అది బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో రాజమౌళి  ఇటీవల టెలికాస్ట్ అయిన    ‘కాఫీ షో విత్ కరణ్ జోహార్’ కార్యక్రమంలో  బాలీవుడ్ టాప్ హీరోల పై చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ మీడియా తీవ్రవిమర్శలు చేస్తోంది. 

సౌత్ స్టార్లు ప్రేక్షకులకు ఏమి కావాలో అలాంటివాటిని గుర్తించి సినిమాలు చేస్తారని కాని నార్త్ హీరోలలో ఆవిషయం కొరవడిందని అంటూ కామెంట్స్ చేసాడు. ఈమాటలకు ఈకార్యక్రమమం నిర్వహిస్తున్న కరణ్ జోహార్ కూడ అవును అంటూరాజమౌళికి మద్దతు పలకడం జరిగింది. ఇప్పుడు ఈవిషయమే బాలీవుడ్ మీడియాలో తీవ్ర దుమారాన్ని లేపుతోంది. 


తెలుస్తున్న సమాచారం మేరకు కొందరు బాలీవుడ్ టాప్ హీరోలు రాజమౌళి మాటల పై తీవ్ర అసహనంలో ఉన్నట్లు టాక్. అంతేకాదు  రాజమౌళి వేరే భాష సినిమా రంగం నుండి గెస్ట్ గా వచ్చిన వ్యక్తి అవగాహన లేకుండా అన్నాడని సర్దుబాటు చేసుకున్నా హిందీ  సినిమాల ద్వారా తన ఉనికిని గుర్తింపును తెచ్చుకున్న కరణ్ జోహార్ లాంటి వ్యక్తి రాజమౌళి మాటలకు మద్దతు పలకడం ఎంటి అంటూ చాలామంది బాలీవుడ్ హీరోలు రగిలిపోతున్నట్లు సమాచారం. 


దీనికితోడు కొంతమంది బాలీవుడ్ టాప్ హీరోలు అయితే ఏకంగా కరణ్ జోహార్ కు ఫోన్ చేసి రాజమౌళి మాటలకు తమ తీవ్రనిరసన చెపుతున్నట్లు టాక్. అయితే రాజమౌళి కామెంట్స్ ను  పబ్లిక్ గా ఖండించాలని చాలమంది టాప్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నా ఈఏడాది బాలీవుడ్ స్టార్ హీరోలుకుసంబంధించి సల్మాన్ ఖాన్ రేస్ 3తో నవ్వులపాలు కాగా అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ షారుఖ్ ఖాన్ ‘జీరో’ మూవీలు ఫెయిల్ అయిన నేపధ్యంలో రాజమౌళి కామెంట్స్ వ్యతిరేకంగా బాలీవుడ్ మీడియా సహకారంతో విమర్శలు చేయిస్తున్నట్లు సమాచారం. రాజమౌళి మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ ను బాలీవుడ్ లో కూడ రిలీజ్ చేయబోతున్న పరిస్థితులలో ఇలా రాజమౌళి ఎందుకు నోరు జారాడో అర్ధం కాని విషయంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: