మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్ ఇప్పటికే చాలా మంది తో డేటింగ్ చేసింది. అయితే ఇంత వరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ మాజీ సుందరి తన కంటే 15 ఏళ్ళు చిన్నోడైన వ్యక్తి తో డేటింగ్ చేస్తుంది. అయితే ఈ అమ్మడు తన తో రొమాంటిక్ స్టిల్స్ ను సోషల్ మీడియా లో వదిలి అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఇటీవల తన ప్రియుడు రోహ‌మన్‌ జన్మదినాన్ని సుస్మిత ఘనంగా నిర్వహించింది.

ప్రియుడి జన్మదినం రోజున

బర్త్ డే రోజున ప్రియుడితో కలిసి రొమాంటిక్‌గా భంగిమలు ప్రదర్శించింది. ఆ వర్కవుట్ ఫోటోలను, వీడియోను తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.  నిజాయితీగా జీవితం సమతుల్యంగా ఉంది. అద్భుతంగా సాగిపోతున్నది. నీతో జీవితం ప్రేమకావ్యంగా మారింది. మనం విజయానికి ప్రతీకలం. నీవు ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ కనిపించాలి. ఐ లవ్ యూ రోహమన్‌ అంటూ ముద్దులు పెట్టింది.

బాలీవుడ్‌కు దూరంగా

సుస్మిత పోస్ట్ చేసిన వీడియో కొద్ది గంటల్లనే లక్ష వ్యూస్ సాధించింది. ప్రస్తుతం సుస్మిత సినిమాలకు దూరంగా ఉంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన తర్వాత కొంత విరామం తీసుకొన్నట్టు కనిపిస్తున్నది. ఇటీవల టెలివిజన్‌లో పలు కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. మంచి ప్రాజెక్టులతో మళ్లీ పరిశ్రమలోకి రావాలని ఎదురుచూస్తున్నది. ఇక రోహమన్ షా టాప్ మోడల్‌గా రాణిస్తున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు నిర్వహించిన పలు షోలలో పాలుపంచుకొన్నాడు. సుస్మిత సేన్‌తో డేటింగ్ చేస్తూ రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. వీరిద్దరూ 2019లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: