తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపైనే చర్చలు నడుస్తున్నాయి.  మొన్నటి వరకు ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అని ఎంతో ఆత్రంగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కి నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ నట జీవితాన్ని కొద్ది వరకు ఆవిష్కరించినట్లు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. 
Image result for patala bhairavi movie
తాజాగా సీనియర్  జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నట జీవితం పై ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిపారు.  ఎన్టీఆర్ బాల్యం నుంచే నాటకాలపై ఎక్కువగా వ్యామోహం ఉండేదని..కాలేజీలో ఎన్నో నాటకాలు వేసేవారని అన్నారు.  ఆ విధంగా నాటకాల్లో ఆయనకి గల అనుభవమే సినిమాల్లో వేషం తెచ్చిపెట్టింది. చెన్నై వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ .. నేను కలుసుకున్నాము. 'మా నాన్న ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇక్కడికి వచ్చాను .. మళ్లీ వాళ్లను డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టకూడదు.

ఇక్కడ నా బతుకు నేను బతకాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ వచ్చే కొద్దిపాటి డబ్బుతో ఎలాగో అలా నెట్టుకురావాలి' అని చెప్పారు. అయితే ఎన్టీఆర్ నటించిన ‘పాతాలభైరవి’చిత్రం ఆయన జీవితాన్నే మార్చేసింది.  అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే  'పాతాళ భైరవి'కి ముందు దగ్గరున్న డబ్బులు అయిపోవడంతో, రెండు రోజుల పాటు తాను పస్తులు వున్నట్టుగా కూడా ఎన్టీఆర్ నాకు చెప్పారు. అలాంటి ఎన్టీఆర్ ఆ తరువాత ఎంతో గొప్ప నటుడు అయ్యారని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: