బోయపాటి తీసిన వినయ విధేయ రామ సినిమా మెగా అభిమానులకు ఒక షాక్ అని చెప్పాలి. సాధ్య తరం కానీ యాక్షన్ సన్నివేశాలు వెరసి సినిమా ను కామెడీగా మార్చి పడేశాయి. చూస్తున్నది ఫాంటసీ సినిమా నా , మామూలు యాక్షన్ డ్రామా అని ఎవరికీ అర్ధం కాలేదు. అయితే  మొదటి రెండు రోజుల వసూళ్ళతో పాటు వీక్ ఎండ్ బాగానే రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ వాటి ప్రాతిపదికన సూపర్ హిట్ అనే అవకాశం లేదు.

Image result for boyapati srinu

ఎందుకంటే గత ఏడాది అజ్ఞాతవాసి ఇంత కన్నా దారుణంగా ఫెయిల్ అయినా యాభై కోట్లకు పైగా షేర్ తెచ్చింది. అయినా ఇది అభిమానులకు పీడకలే. ఇది పక్కన పెడితే వినయ విధేయ రామ ఫలితం గురించి అందరి వేళ్ళూ బోయపాటి శీను వైపే వెళ్తున్నాయి.ఇలాంటి కథను ఎంచుకోవడంలో చరణ్ పొరపాటు ఉన్నప్పటికీ మరీ నేల విడిచి సాము చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం శీను తెలివితేటలే కదా. సో సరైనోడుతో తెచ్చుకున్న మెగా కాంపౌండ్ ఇంప్రెషన్ వివిఅర్ దెబ్బతో పోయిందనే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.

Image result for boyapati srinu and chiranjeevi

మొన్నటి దాకా శీనుతో సినిమా చేయాలనీ తెగ ఆసక్తి చూపిన మెగాస్టార్ చిరంజీవి పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.దీన్ని నిర్మించేందుకు ముందు నుంచి ఉత్సాహ పడ్డ సరైనోడు నిర్మాత కం బావమరిది అల్లు అరవింద్ సైతం డౌట్ గానే ఉన్నారట. మొత్తానికి వినయ విధేయ రామ ఎఫెక్ట్ మాములుగా లేదు బోయపాటి మీద. ఒకవేళ గతంలో నిజంగా మాట ఇచ్చి ఉంటే తప్ప ఇకపై చిరు బోయపాటి కాంబో మూవీ సాధ్యం కదాని మెగా సన్నిహితులు అంటున్నారు. ఎలాగూ సైరా తర్వాత కొరటాల శివ త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు చిరు కమిట్ అయ్యాడు కాబట్టి మళ్ళి ఈ టాపిక్ ఓ రెండు మూడేళ్ళ తర్వాత వెలుగులోకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: