టాలీవుడ్ లో దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు.  వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.  అప్పటి వరకు చిరు ఎంట్రీ పై రక రకాల అనుమానాలు వచ్చాయి.  ఖైదీ నెంబర్ 150 సినిమాలో రైతుల కోసం పోరాడే హీరోగానే కాకుండా..కమర్శియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి కూడా మంచి ఎంట్రటైన్ ఇచ్చారు చిరంజీవి.  ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంతో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవారి నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నారు. 
First look of VijaySethupathi as RaajaPaandi in  Sye raa Narasimhareddy
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా నుంచి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.  ఇటీవల తమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా..తాజాగా తమిళ నటుడు విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘సైరా’లో విజయ్ సేతుపతి  రాజా పాండి అనే పాత్రలో నటిస్తున్నారు.
Image result for saira narasimha reddy
నేడు సేతుపతి పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్ చెబుతూ.. సినిమాలో విజయ్ పాత్రకు సంబంధించిన మోషన్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.  తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, నయనతార, కిచ్చ సుదీప్, తమన్నా వంటి ప్రముఖ నటులు సినిమాలో కనిపించ నున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: