తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం రిలీజ్ కి ముందు నుంచి బాగా హైప్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసిన వర్మ నిన్న ఎన్టీఆర్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. 

ఈ టీజర్ లో అచ్చం ఎన్టీఆర్ ని దింపేశాడని..అచ్చుగుద్దినట్లు ఎన్టీఆర్ లా ఉన్నారని రక రకాల కామెంట్స్ వినిపించాయి.  అయితే ఈ పాత్రదారుడి పేరు మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు.  దాంతో ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న నటుడు ఎవరూ..ఇక్కడి వాడా కాదా అన్న అనుమానాలు వచ్చాయి. 
Image result for laxmis ntr
తాజాగా ఈ అనుమానాలకు పులిస్టాప్ పెడుతూ..ఎన్టీఆర్ పాత్రదారుడి పేరు తెలిపారు రాంగోపాల్ వర్మ.  ఆ వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడని చెప్పారు. ఎన్టీఆర్ లా ప్రసంగించడం, హావభావాలు పలికించడం వంటి విషయాల్లో ఆయనకు శిక్షణ ఇచ్చిన విషయాన్ని తన ట్వీట్ లో పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: