ఈ సమ్మర్ రేస్ కు రాబోతున్న మహేష్ ‘మహర్షి’ మొదట్లో అనుకున్నట్లుగా ఏప్రియల్ మొదటివారంలో రాబోతున్న ‘ఉగాది’ పండుగరోజున రావడం లేదు. ఈమూవీకి సంబంధించిన షూటింగ్ నెమ్మదిగా చేయాలి అన్న ఉద్దేశ్యంతో మహేష్ సలహా మేరకు ఈమూవీ రిలీజ్ డేట్ ను మార్చారు. 
Mahesh Babu Maharshi Movie Updates - Sakshi
ఇప్పుడు మహేష్ కు సెంటిమెంట్ గా కలిసి వచ్చే ఏప్రియల్ చివరి వారంలో ఏప్రియల్ 24న ఈ మూవీని విడుఅదల చేయడానికి నిశ్చయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సాధారణంగా సినిమాలు విడుదలయ్యే గురువారం శుక్రువారంలలో కాకుండా ‘మహర్షి’ బుధవారం విడుదల కాబోతోంది. 
Maharshi Teaser out
సమ్మర్ హాలీడేస్ కాబట్టి, బుధవారం విడుదల చేస్తే లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని నిర్మాతగా దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఈమూవీకి పోటీగా మరి ఏసినిమాలు ఉండవు కాబట్టి మొదటి వారం వీకెండ్ ముగిసేలోగా ‘మహర్షి’ కి భారీ కలక్షన్స్ రాబట్టాలని దిల్ రాజ్ ఆలోచన అని అంటున్నారు. 
Maharshi teaser,Mahesh Babu Maharshi teaser,Mahesh Babu Maharshi
అయితే ఈ ఆలోచన బాగానే ఉన్నా వారం మధ్యలో వచ్చే బుధవారం టాప్ హీరోల సినిమాలకు ఇప్పటి వరకు బాగా కలసివచ్చిన సందర్భాలు లేవు అన్న కొత్త సెంటిమెంట్ ను తెర పైకి తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈసంక్రాంతి రేస్ కు విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ జనవరి 9 బుధవారం రోజున ఇలాగే లాంగ్ వీకెండ్ మరియు సంక్రాంతి రోజుల కలక్షన్స్ ను టార్గెట్ చేద్దామని విడుదలై చతికల పడింది. ఇప్పుడు అదే నెగిటివ్ సెంటిమెంట్ ‘మహర్షి’ ని వెంటాడుతుందా అంటూ అప్పుడే నెగిటివ్ సెంటిమెంట్ కు ప్రచారానికి తెర తీస్తున్నారు కొందరు..   


మరింత సమాచారం తెలుసుకోండి: