తెలుగు ఇండస్ట్రీలోకి పూరి జగన్నాధ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక.  బాలీవుడ్ లో బాలనటిగా పలు టివి సీరియల్స్ లో నటించిన హన్సిక తర్వాత వెండి తెరపై బాలనటిగా ప్రవేశించి పలు చిత్రాల్లో నటించింది.  హన్సిక బాలీవుడ్ నటి అయినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ చిత్రాల్లో నటించింది. 

ప్రస్తుతం ఈ యాపిల్ బ్యూటీ ‘మహా’ అనే హర్రర్ జానర్ చిత్రం చేస్తున్నది.  హన్సికకు మహా 50వ చిత్రం. జమీల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.  తాజాగా ఈ చిత్ర షూటింగ్ జరుతున్న సమయంలో హన్సికకు గాయాలు అయినట్లు సమాచారం. 

యాక్షన్ సీన్స్ చిత్రీకరించే సమయంలో స్లిప్ కావడంతో కిందపడింది.  చేతికి గాయం అయ్యింది.  గాయంతోనే హన్సిక యాక్షన్స్ సీక్వెన్స్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా చిత్రాలు చేస్తుంది హన్సిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: