పైకి చెప్పకపోయినా బాలకృష్ణ ‘కథానాయకుడు’ ఫెయిల్యూర్ ను జీర్ణించుకోలేకపోతున్నాడని సమాచారం. ఈమూవీ విషయంలో ఎదురైన ఘోర పరభావాన్ని తగ్గించుకోవడానికి ‘మహానాయకుడు’ విషయంలో అనేక భారీ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ‘కథానాయకుడు’ మూవీలో ఎమోషన్ పార్ట్ బాగా తగ్గింది అన్న కామెంట్స్ రావడంతో ‘మహానాయకుడు’ కీలక సన్నివేశాల రీషూట్ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. 
NTR Biopic First Poster: Nandamuri Balakrishna Is The Image Of NTR
తెలుస్తున్న సమాచారం మేరకు ‘మహానాయకుడు’ రిపేర్లకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలలో క్రిష్ పాత్ర చాల తక్కువగా కనిపిస్తోందని టాక్. ఈమూవీ రిపేర్లకు సంబంధించి అన్ని నిర్ణయాలు బాలయ్య స్వయంగా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే ఒక వ్యక్తిగా మాత్రమే క్రిష్ కొనసాగుతున్నాడు కానీ ఈ రిపేర్ల విషయంలో క్రిష్ తన క్రియేటివిటీని ఏమాత్రం ఉపయోగించడం లేదు అని అంటున్నారు. 
Extra Scenes and Fresh Trailer For NTR - Mahanayakudu
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని ఫిబ్రవరి మూడవ వారంలో విడుదల చేయాలని ఈసినిమాకు సంబంధించిన మరొక లేటెస్ట్ ట్రైలర్ ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు టాక్. అంతేకాదు ఈమూవీకి మరింత ప్రచారం కలిగించదానికి అమరావతిలో ఈమూవీ ప్రమోషన్ ఫంక్షన్ ను నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ బాలయ్య చేస్తున్నట్లు టాక్.
NTR Kathanayakudu Biopic - BookMyShow
మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకాబోతున్న నేపధ్యంలో ఎట్టి పరిస్తుతులలోను ‘మహానాయకుడు’ రిపేర్లను 10వ తారీఖు లోపుగా పూర్తి చేయాలని బాలకృష్ణ భావిస్తున్నా ఈవిశాయాల పై కేవలం యాంత్రికంగా మాత్రమే క్రిష్ పనిచేస్తున్నాడు అని గాసిప్పులు వినిపిస్తున్నాయి. గతవారం విడుదలైన ‘మణికర్ణిక’ విజయం సాధించినా ఆవిజయం కంగనా రనౌత్ ఖాతాలోకి వెళ్లిపోవడంతో పాటు ఎన్ని రిపేర్లు చేసినా వాస్తవాలకు దూరంగా ఉండే ‘మహానాయకుడు’ విజయం సాధించడం కష్టమే అన్న అభిప్రాయం తనకు ఉన్నా పైకి బాలయ్యతో చెప్పుకోలేని పరిస్థితి మధ్య ‘మహానాయకుడు’ రిపేర్లు కొనసాగుతున్నాయని సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: