ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.  అయితే  కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక..వాటిపై క్లారిటీ ఇచ్చుకునే పనిలో ఉంటారు సెలబ్రెటీలు.  తాజాగా బాహుబలి సినిమాలో కట్టప్పగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సత్యరాజ్.  గతంలో ఆయన ఎన్నో సినిమాల్లో నటించినా బాహుబలి సినిమాలో  బాహుబలికి మామగా..మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసగా సత్యరాజ్ నటన అద్భుతం.  అయితే మొదటి పార్ట్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న సస్పెన్స్ ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చింది. 
Image result for satya raj
తాజాగా నటుడు సత్యరాజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ విషయంపై అసలు నిజం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ ఊపరి పీల్చుకున్నారు.  వాస్తవానికి తమిళనాడులోని ఎండీఎంకే పార్టీ నేత సత్యరాజ్ బాలుని పోలీసులు అరెస్ట్ చేశారు.  గత ఆదివారం నరేంద్ర మోదీ తమిళనాడులోని మదురైలో పర్యటించిన సంగతి తెలిసిందే.   
Image result for kattappa bahubali
తమిళనాట మోదీ పర్యటన నిరసిస్తూ..ఎండీఎంకే కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో నాగపట్టణం జిల్లాలో శీర్గాలీ పట్టాన కార్యదర్శిగా ఉన్న సత్య రాజ్ బాలు 'చిప్ప పట్టుకున్న మోదీ' వ్యంగ్య చిత్రాన్ని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు. దాంతో బీజేపి నేతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సత్యరాజ్ బాలుపై చర్యలు తీసుకొని అతడిని అరెస్ట్ చేశారు. పేర్లు ఒకటే కావడంతో సోషల్ మీడియాలో సత్యరాజ్ అరెస్ట్ అని వార్తలు రాగానే అందరూ సినీ నటుడు సత్యరాజ్ అనుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: