టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన నాని ‘అష్టాచమ్మ’సినిమాతో హీరోగా మారారు.  ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన నానికి పెద్దగా గుర్తింపు రాలేదు.  ఇక బోల్డ్ కాన్సెప్ట్ తో డబులు మీనింగ్ డైలాగ్స్ ఒకటీ రెండు సినిమాలు తీసిన మారుతి తర్వాత కామెడీ డైరెక్టర్ గా మారారు.  నాని, మారుతి కాంబినేషన్ లో ‘భలే భలే మగాడివోయ్’సినిమాతో వీరిద్దరి దశ తిరిగిపోయింది.   ప్రేమ కథా చిత్రమ్ సినిమాతో మంచి కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వరుసగా విజయాలు తన ఖాతలో వేసుకుంటూ వచ్చారు.
Image result for bhale bhale magadivoy
ఇక నేచురల్ స్టార్ నాని ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత వరుసగా ఆరు సినిమాల విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.  ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందా అనుకుంటున్న సమయంలో ప్రేక్షకులకు గుడ్ న్యూస్ తెలిపారు. తాజా స‌మాచారం ప్ర‌కారం నాని- మారుతి కాంబినేష‌న్ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని కూడా చెబుతున్నారు.
Image result for nani jersey movie
నాని మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో జెర్సీ సినిమాలో చేస్తున్నాడు. క్రీడా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక మారుతి దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని గ‌తంలో ప‌లు వార్తలు రాగా, కాకపోతే దీనిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ లేదు. మరోవైపు నాని ‘మనం’ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: