‘ఎఫ్ 2’ సక్సస్ తో టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయిన అనీల్ రావిపూడి నిర్మాత దిల్ రాజ్ ల మధ్య ఒక కారు ఊహించని గ్యాప్ క్రియేట్ చేసింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే దిల్ రాజ్ ‘ఎఫ్ 2’ భారీ సక్సస్ అయినందుకు అనీల్ రావిపూడికి సుమారు కోటిరూపాయలు విలువచేసే ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు అన్న వార్తలు మీడియాలో తెగ హడావిడి చేసాయి. 

ఈవార్తలను చూసిన అనీల్ రావిపూడి సన్నిహితులు అతడికి ఫోన్ చేసి అభినందనలు తెలియచేస్తే తన ఇంటికి రాని బహుమతి గురించి అభినందనలు ఏమిటి అంటూ షాక్ అయినట్లు సమాచారం. అంతేకాదు ‘ఎఫ్ 2’ సక్సస్ తరువాత తాను అనేకసార్లు దిల్ రాజ్ ను కలిసినా తమ ఇద్దరి మధ్యా ఎప్పుడు ఈ లగ్జరీ కారు బహుమతి గురించి ప్రస్తావన రాలేదని అనీల్ రావిపూడి నవ్వుతూ కామెంట్ చేస్తున్నట్లు టాక్.

అంతేకాదు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నిజంగానే తనకు దిల్ రాజ్ అలాంటి లగ్జరీ కారును బహుమతిగా ఇస్తే బాగుండును అని కోరుకుంటున్నానని అనీల్ రావిపూడి తన సన్నిహితులతో సెటైర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దిల్ రాజ్ మరో ఆలోచన చేయకుండా ‘ఎఫ్ 2’ సక్సస్ కు కృతజ్ఞతగా కోటి రూపాయల కారు ఇస్తాడో లేదో చూడాలి అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో పెరిగిపోతోంది. 

ఇది ఇలా ఉండగా దిల్ రాజ్ 2021 సంక్రాంతికి అనీల్ రావిపూడి దర్శకత్వంలోనే ‘ఎఫ్ 3’ తీయబోతున్నట్లు ప్రకటన ఇప్పటికే చేసాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కారు బహుమతిని దిల్ రాజ్ అనీల్ రావిపూడికి ఇవ్వవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ టాప్ 10 సినిమాల లిస్టులోకి చేరిపోయిన ‘ఎఫ్ 2’ మ్యానియాను చూస్తూ ఉంటే ఈమూవీ కలక్షన్స్ ఏ రేంజ్ కి చేరిపోతాయో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: