ఫోబ్స్ ఇండియా 6వ ఎడిషన్ కు సంబంధించి ప్రకటించిన 30 సంవత్సరాలలోపు 30 ప్రతిభావంతుల లిస్టులో విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకోవడం సంచలన వార్తగా మారింది. కేవలం సినిమా రంగంలోని పాపులారిటీని మాత్రమే కాకుండా ఈమధ్యనే ప్రారంభించిన అతడి ‘రౌడీ గార్మెంట్స్’ వ్యాపారానికి సంబంధించి అతడు సాధించిన విజయాన్ని అదేవిధంగా పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఫోబ్స్ మ్యాగజైన్ ఈ గుర్తింపు ఇచ్చింది.  

ఇలాంటి పరిస్థుతులలో తనకు వచ్చిన ఈ గౌరానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ విజయ్ గతంలో తనకు జరిగిన ఒక అవమానం తన అభిమానులకు తెలిసే విధంగా స్ఫూర్తి దాయకంగా వివరించాడు. 5 సంవత్సరాల క్రితం ఆంధ్రాబ్యాంక్ లో 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్ లేదని తన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిన విషయాన్ని వివరిస్తూ అలాంటి తనకు ఇలాంటి గౌరవం రావడం వెనుక తన అదృష్టంతో పాటు తన పట్టుదల కూడ ఉంది అన్న విషయాన్ని వివరించాడు.

గతంలో తన ఆంధ్రాబ్యాంక్ ఎకౌంట్ క్లోజ్ అయిన నేపధ్యంలో తాను బాధ పడుతున్నప్పుడు తన తండ్రి తనకు చెప్పిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. ఏ వ్యక్తి అయినా ఆర్ధికంగా 30 సంవత్సరాల లోపు స్థిరపడి తీరాలని లేకుంటే ఇలాంటి అవమానాలు తప్పవు అంటూ తన తండ్రి చెప్పిన మాటల వల్ల తాను స్పూర్తిని పొందాను అని చెపుతూ తన అభిమానులు కూడ వారి జీవితాలకు సంబంధించి 30 సంవత్సరాల .లోపే ఆర్ధికంగా స్థిరపడమని ఆతరువాత మాత్రమే తనను అభిమానించే విషయాలని చెపుతూ విజయ్ తన అభిమానులకు ఇచ్చిన సందేశం ఇప్పుడు వైరల్ గా మారింది.

సామాన్యంగా టాప్ హీరోలు తమ అభిమాన సంఘాల సంఖ్య పెంపుదల కోసం లేదంటే తమ సినిమాల రికార్డుల కలక్షన్స్ ఫిగర్స్ కోసం తమ అభిమానులకు సందేశాలు ఇచ్చే నేటి పరిస్థుతులలో విజయ్ దేవరకొండ దానికి భిన్నంగా తనతో పాటు తన అభిమానులు కూడ ఎదగాలని ఇస్తున్న సూచనలు అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు వ్యాపార వేత్తగా నిర్మాతగా సెటిల్ అవ్వాలని విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు అతడి సక్సస్ ఫుల్ జీవితానికి ఉదాహరణగా చెప్పుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: