బాలీవుడ్‌లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం ఉరి.. ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. మంచి కథ.. ఆకట్టుకునే కథనం ఉంటే.. ఏ చిత్రమైనా వసూళ్ల వర్షం కురిపిస్తుందని నిరూపిస్తోంది. రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ ట్రేడ్ పండితుల అంచనాలను సైతం తలకిందులు చేస్తోంది.

Image result for uri vs bahubali


ఇప్పటివరకూ హిందీలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉన్న బాహుబలి-2 రికార్డులను చెరిపేలా ఉంది. బాహుబలి -2 చిత్రం 23, 24 రోజుల్లో సాధించిన వసూళ్లను ‘ఉరీ’ చిత్రం అధిగమించడం విశేషం. బాహుబలి-2 సినిమా 23వ రోజు కలెక్షన్స్ రూ.6.35 కోట్లు, 24వ రోజు రూ.7.80 కోట్లు వచ్చాయి.

Related image


ఉరీ’ చిత్రం 23వ రోజు కలెక్షన్స్ రూ. 6.53 కోట్లు వసూలు చేస్తే.. 24వ రోజు రూ. 8.71 కోట్లు వసూళ్లు చేయడం సంచలనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై రోజులు గడుస్తూ ఉంటే.. కలెక్షన్లు తగ్గడం సాధారణం కానీ.. ఉరి విషయంలో ఇది రివర్స్ అవుతోంది. సినిమా విడుదలైన ఫస్ట్ రోజు కలెక్షన్ల కంటే.. 24వరోజు కలెక్షన్ ఎక్కువ ఉండటం ఆ సినిమా సత్తాను నిరూపిస్తోంది.

Related image


2016లో ఇండియన్ ఆర్మీపై పాక్‌ జరిపిన ఉగ్రదాడి ఆధారంగా ఈ ఉరి సినిమా రూపొందింది. కేవలం 45 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం ఇప్పటివరకూ దాదాపు 300 కోట్లు వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాహుబలి రికార్డు 1800 కోట్లు రాబట్టకపోయినా.. రోజువారీ కలెక్షన్లలో బాహుబలి రికార్డును ఉరి అధిగమించడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: