భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా తనదైన ముద్ర వేశారు దివంగత నటి శ్రీదేవి.  దేశ వ్యాప్తంగా లక్షలమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి శ్రీదేవి క్రితం ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్ లోని ఒక హోటల్లో హఠాత్తుగా చనిపోయారు.  బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీదేవి తన పదహారేళ్ల వయసులో హీరోయిన్ గా మారింది.  తెలుగులో అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ,శోభన్ బాబు లతో నటించింది.
Image result for sridevi family
ఆ తర్వాత జనరేషన్ అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ల సరసన నటించి మెప్పించింది.  తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలుగుతున్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  అక్కడ కూడ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది.  స్టార్ ప్రొడ్యూసర్ అయిన బోని కపూర్ ని వివాహం చేసుకుంది.  వీరికి జాహ్నవి, ఖుషీ కపూర్ లు జన్మించారు.  కుటుంబం కోసం చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు శ్రీదేవి. ఇంగ్లీష్..వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె కొన్ని సినిమాల్లో నటించారు. 
Image result for sridevi death
గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్ లోని ఒక హోటల్లో హఠాత్తుగా చనిపోయారు. ఆమె మరణ వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేనివాళ్లు ఎంతోమంది వున్నారు. అప్పుడే శ్రీదేవి చనిపోయి ఏడాది కావొస్తుందా అని బయటివారికి అనిపించవచ్చు. కానీ శ్రీదేవి కుటుంబ సభ్యులు మాత్రం ప్రతి రోజు ఒక ఏడాదిలానే గడిపారు. శ్రీదేవి ప్రథమ వర్ధంతిని జరపడానికి ఆమె కుటుంబం సిద్ధం అవుతుంది.

ఆమెకు ఎంతగానో ఇష్టమైన చెన్నై నగరం అంటే ఎంతో ఇష్టం..అంతే కాదు అక్కడ తన సొంత ఇంటిపై ఎంతో మమకారం చూపించేదట. దాంతో ఆమె ప్రథమ వర్ధంతిని జరపాలని వాళ్లు నిర్ణయించుకున్నారని సమాచారం. అక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలో శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్టు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: