రేణూదేశాయి అంటే తెలుగు జనాలకు పరిచయం అవసరం లేని పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మాజీ భార్యగా ఆమెకు కూడా బాగానే ఫాన్ మెయిల్ ఉంది. దాన్ని సొమ్ము చేసుకుందామని ఎంతో మంది ట్రై చేసిన కుదరలేదు. రేణూ దేశాయ్ ముంబైలో ఉంటోంది. ఆమె పిల్లలను అక్కడే చదివించుకుంటూ తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పాటు చేస్తుంది.


అటువంటి రేణూ పేరు ఇపుడు టాలీవుడ్లో మరో మారు వినిపిస్తోంది. ఆమె లేటెస్ట్ గా ఓ మూవీకి కమిట్ అయ్యారని టాక్. బెల్లంకొండ శ్రీనివాస్ నటించే ఓ మూవీలో ఇంపార్టంట్ క్యారెక్టర్ రేణూ చేస్తుందని అంటున్నారు. శ్రీనివాస్ కి అక్క పాత్రలో రేణూ కనిపిస్తుందని చెబుతున్నారు. అదే నిజనమైతే టాలీవుడ్లో రేణూ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లే.


ఆ మధ్యన ఓ టీవీ షోలో కనిపించిన రేణూ దేశాయ్ సినిమాలకు మాత్రం నో చెబుతూ వచ్చింది. ఆమె చేత మంచి పాత్రలు చేయించాలని, ఆమె ఫాన్ ఫాలోయింగ్ ని బాగా వాడుకోవాలని చూసిన వారికి అప్పట్లో నిరాశే కలిగింది. కానీ బెల్లంకొండ మూవీకి రేణూ ఒప్పుకోవడం షాక్ లాంటిదే. మరి ఆమె ఇపుడు తన డెసిషన్ చేంజ్ చేసుకున్నారేమోనని అంటున్నారు. ఏది ఏమైనా రేణూ చాలా ఏళ్ల తరువాత  తెలుగు మూవీలో నటిస్తే మాత్రం అది చాలా ఇంటెరెస్టింగ్ పాయింటే మరి. దాన్ని గుర్తించే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందనే బెల్లంకొండ న్యూ మూవీకి ఒప్పించారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: