మహా నాయకుడు ఈనెల 22న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రివ్యూలు బాగానే వచ్చినా కాసులు మాత్రం రాలలేదు. బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. వారికి బాలయ్య కాస్త ఊరట కల్పించారని వార్తలు వచ్చాయి.



ఇప్పుడు వారి ఆశలన్నీ ఎన్టీఆర్ మహానాయకుడిపైనే ఉన్నాయి. అయితే ఇది పూర్తిగా రాజకీయ చిత్రం కావడం.. అందులోనూ నాదెండ్ల ఎపిసోడ్ వరకూ మాత్రమే ఉంటుందని వార్తలు రావడంతో చిత్రం ఎంతవరకూ ఆకట్టుకుంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత చిత్రం


దీనికి తోడు మహానాయకుడు సినిమాకు పోటీగా విడుదలవుతున్న సినిమాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. మహానాయకుడుకు పోటీగా మూడు అడల్ట్ కంటెంట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయివాటిలో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమా ఒకటిపక్కా బూతు సినిమా అన్న సంగతి ట్రైలర్‌లోనే అర్థమైపోయింది.

4 letters movie telugu కోసం చిత్ర ఫలితం


ఇక చితక్కొట్టుడు తో పాటుగా '4  లెటర్స్' అనే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. టైటిల్ కళాత్మకంగా ఉన్నా.. లోపల ఉన్నది బూతు కంటెంటే. దీనికి తోడు ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ నటించిన 'మిఠాయి' కూడా రిలీజ్ అవుతోంది. ఇది బూతు కాకపోయినా అడల్ట్ కంటెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ బూతు సినిమాలను తట్టుకుని మహానాయకుడు ఎంతవరకూ నిలబడతాడో..?


మరింత సమాచారం తెలుసుకోండి: