ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. అయితే మరలా ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది. కానీ ఇంత వరకు ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కథానాయకుడు సంక్రాంతికి రిలీజైనప్పుడు ఏ సంబంధం లేని మహేష్ బాబు బాలయ్యను సినిమాను పొగడ్తలతో ముంచెత్తగా అదే ట్విట్టర్ వేదికగా తారక్ చిన్న మాట కూడా అనలేకపోయాడు.

Image result for jr ntr and balakrishna

ఇప్పుడు మహానాయకుడు వంతు వచ్చింది. బాలకృష్ణను కాసేపు పక్కన పెట్టినా స్వంత అన్నయ్య రెండూ సినిమాల్లోనూ ఉన్నాడు. ఏదో వేషం కాదు. నాన్న హరికృష్ణ నిజ జీవిత పాత్ర చేసాడు. దాని కోసమైన ఓ మెసేజ్ ట్వీట్ చేయొచ్చు. మహానాయకుడు వచ్చేసినా  జూనియర్ ఇప్పుడూ మౌనాన్నే ఆశ్రయించడం నందమూరి అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది.ఆడియో రిలీజ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్  మా తాత కథను బాబాయ్ సినిమా రూపంలో ఇదిగో మీ తాత తీసాడని చూపిస్తామని ఓ రేంజ్ లో పొగిడాడు.

Image result for jr ntr and balakrishna

దాని తర్వాత ఎలాంటి ఊసు లేదు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ అని తప్పుకోవడానికి లేదు. దుబాయ్ వెళ్ళాడు. చరణ్ తో మాత్రమే జరిగిన షెడ్యూల్ లో తను రిలాక్స్ అయ్యాడు. ఆ సమయంలో ఏదో ఒకటి ట్వీటోచ్చు. అయినా కూడా చేయలేదు అంటే కారణం ఏమై ఉంటుందో. హరికృష్ణ మరణం తర్వాత బాబాయ్ అబ్బాయ్ ఫుల్ గా కలిసిపోయారు అనుకుంటే ఈ మౌనం కొత్త అనుమానాలు రేపుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: