మెగా బ్రదర్ నాగబాబు వివిధ  రాజకీయ  సినిమాలకు సంబంధించిన వివాదాస్పద విషయాల పై తన సొంత వెబ్ ఛానల్ లో అప్ లోడ్ చేస్తున్న వీడియోలు చాలామందిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం నాగబాబు ‘జనసేన’ పార్టీలో కీలకంగా లేకపోయినా పరోక్షంగా తన తమ్ముడు పవన్ మాట్లాడే అనేక విషయాలకు తన సంఘీభావాన్ని తెలియ చేస్తూ వీడియోలు పెడుతూ పవన్ పిలుపు గురించి ఎదురు చూస్తున్నారు. 
చంపేస్తారా నేను రెడీ
ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో నాగబాబు లేటెస్ట్ గా యూట్యూబ్ లో పెట్టిన ఒక వీడియో పవన్ అభిమానులను ముఖ్యంగా ‘జనసేన’ కార్యకర్తలకు విపరీతంగా కనెక్ట్ అవుతోంది. ‘జనసేన’ కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అధికార దర్పంతో పోలీసుల సహాయంతో ‘జనసేన’ కార్యకర్తలను అరెస్ట్ చేయించడం పై నాగబాబు తన తీవ్ర నిరసనను తెలియచేస్తూ అవసరం అనుకుంటే తాను పవన్ కళ్యాణ్ కోసం ప్రాణ త్యాగానికి కూడ సిద్ధం అంటూ జనసైనికులకు ఉత్సాహాన్ని ఇస్తూ ఒక వీడియో విడుదల చేసాడు నాగబాబు. 
 అలా అనుకుంటే పొరపాటే
ఇదే సందర్భంలో నాగబాబు ఆవేశంతో ఊగిపోతూ కేసులు పెడితే తాము భయపడిపోతాము అని భావించడం పొరపాటు అనీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.  ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎక్కువ కాలం అధికారంలో ఉంటామని కలగనడం అవివేకం అంటూ తాను ‘జనసేన’ పార్టీలో లేకపోయినా జనసైనికులకు జరుగుతున్న అన్యాయం చూసి తన రక్తం ఉడికి పోతోంది అంటూ పవన్ అభిమానులకు తన సంఘీభావం తెలియ చేస్తున్నాడు నాగబాబు.
Nagababu
అంతేకాదు తనకు ఇప్పటికే 59 ఏళ్ళు వచ్చిన నేపధ్యంలో ఇక తాను దేనికీ భయపడను అంటూ అవసరం అనుకుంటే జనం మధ్యకు వచ్చి పవన్ కు మద్దతుగా ప్రజాపోరాటాలు చేస్తాను అంటూ సంకేతాలు ఇస్తున్నాడు నాగబాబు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగబాబు పవన్ పక్కన ఉండకుండా కేవలం వీడియోలతో హడావిడి చేస్తూ ఎన్నికలు ముగిసిన తరువాత నాగబాబు జనసైనికుల కోసం ప్రజాపోరాటం చేస్తే ఎంతవరకు సమంజసమో నాగబాబు విజ్ఞతకే తెలియాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: