ఆ మద్య కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంలో ఊరిని దత్తత తీసుకొని బాగుపరుస్తాడు. ఈ చిత్రం ఎంతో మందిపై సెలబ్రెటీలపై ప్రభావం చూపించింది. చాలా మంది రియల్ లైఫ్ లో కొన్ని ఊర్లను దత్తత తీసుకొని బాగుపరుస్తున్న సందర్బాలు ఉన్నాయి. అయితే ఊర్లనే కాదే కొన్ని జీవాలను దత్తత తీసుకొని వాటి బాగోగు బాధ్యతలు చూసుకుంటున్నారు మరి కొంతమంది సెలబ్రెటీలు.
తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా చెన్నై సమీపంలో ఉన్న వాండలూర్ జూలోని రెండు తెల్ల పులులని దత్తత తీసుకున్నారు. ఆరు నెలల పాటు ఈ పులులకి కావలసిన ఆహారానికి సంబంధించిన ఖర్చు అంతా తానే భరిస్తానని అన్నాడు. దానికి సంబంధించిన రూ.5 లక్షల చెక్కు జూ నిర్వాహకులకు ఇచ్చారు.
ఆ మద్య హీరో శివకార్తికేయన్ చెన్నై వండలూర్లోని అరిగ్నర్ అన్నా జూలాజికల్ పార్క్లో ఉన్న తెల్ల పులిని దత్తత తీసుకున్నాడు. అను పేరుతో ఉన్న ఆ పులిని ఆరు నెలల పాటు దత్తత తీసుకున్నాడు. దేళ్ల వయస్సు ఉన్న తెల్ల పులిని 2.12 లక్షలు చెల్లించి దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.