తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ జంటగా పేరు తెచ్చుకున్నారు సమంత, నాగ చైతన్య.   ‘ఏం మాయ చేసావే’ చిత్రంలో నటించిన ఈ జంట తర్వాత ఆటోనగర్ సూర్య, మనం చిత్రంలో నటించారు.  రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు.  వివాహం జరిగిన తర్వాత  సమంత మహానటి, రంగస్థలం,అభిమన్యుడు, యూటర్న్ చిత్రాల్లో నటించి మంచి హిట్స్ సాధించింది.  ఇక నాగ చైతన్య సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు చిత్రాల్లో నటించాడు. 
Related image
ఈ చిత్రాలు పెద్దగా విజయం అందుకోలే పోయాయి.  వివాహం జరిగిన తర్వాత మొదటి సారిగా చైతూ జంట నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, దివ్యాంశ కౌశిక్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో అందరి దృష్టి దీనిపై పడింది.  దాంతో ఈ చిత్రంబిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుందని సమాచారం. ఒక్క శాటిలైట్ రైట్స్ రూ.5 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
Image result for majili movie posters
జెమినీ టీవీ ఐదు కోట్ల మొత్తాన్ని చెల్లించి సినిమా శాటిలైట్ హక్కులు పొందింది.  ఇక డిజిటల్ హక్కులు .. హిందీ డబ్బింగ్ రైట్స్ అమెజాన్ కి మంచి రేటుకి ఇచ్చినట్టు తెలుస్తోంది. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో చైతు, సమంత మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తలుగా కనిపించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: